Director Shankar : రాజమౌళి తో సరిసమానమైన ఇమేజి, క్రేజ్ ఉన్న దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది శంకర్ మాత్రమే. రాజమౌళి పాన్ ఇండియన్ సినిమాలు ఇప్పుడు చేస్తుంటే శంకర్ మూడు దశాబ్దాల క్రితమే పాన్ ఇండియన్ సినిమాలు చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసాడు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు చూస్తే మూడు దశాబ్దాల క్రితం ఈ స్థాయిలో అలోచించి ఒక దర్శకుడు ఎలా సినిమాలు తీసాడు అని ఆశ్చర్యపోక తప్పదు. ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరూ ఎదో ఒక హాలీవుడ్ చిత్రం నుండి కాపీ కొట్టి తీస్తున్న సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ శంకర్ బుర్రలో నుండి వచ్చిన ఆలోచనలు హాలీవుడ్ సినిమాలు సైతం కాపీ కొట్టేలా ఉంటాయి. అంతటి ప్రతిభ గల దర్శకుడు ఆయన. అయితే రీసెంట్ గా కమల్ హాసన్ తో ఆయన చేసిన ‘ఇండియన్ 2 ‘ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ గా మిగిలిందో మన అందరికీ తెలిసిందే.
ఇండియన్ లాంటి ఆల్ టైం క్లాసిక్ చిత్రానికి తియ్యాల్సిన సీక్వెల్ ఇదేనా?, శంకర్ కి అసలు ఏమైంది, బుర్ర చెడిపోయిందా? వంటి సందేహాలు ఆయన అభిమానుల్లో నెలకొన్నాయి. అయితే ‘ఇండియన్ 2 ‘ చిత్ర ఫలితం శంకర్ ని తీవ్రంగా కృంగిపోయేలా చేసిందా?, ఇంకా ఆయన ఆ సినిమా ఫ్లాప్ అయిన షాక్ నుండి తేరుకోలేదా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా ‘గేమ్ చేంజర్’ నుండి ఒక పోస్టర్ ని విడుదల చేసింది మూవీ టీం. శంకర్ కూడా తన ట్విట్టర్ ఖాతా నుండి ‘గేమ్ చేంజర్’ పోస్టర్ ని అప్లోడ్ చేసాడు. కానీ ఎదో వెయ్యాలి అన్నట్టుగా వేసినట్టు ఉన్నాడు కానీ, ఆ సినిమాలో పనిచేస్తున్న హీరో రామ్ చరణ్ ని, హీరోయిన్ కియారా అద్వానీ ని, నిర్మాత దిల్ రాజు ని ఇలా టీం లో పని చేసిన ఒక్కరిని కూడా ట్యాగ్ చేయకుండా ఈ పోస్టు వేసాడు. కనీసం ‘గేమ్ చేంజర్’ చిత్రం ట్యాగ్ ని కూడా ఉపయోగించలేదు. వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియచేయలేదు. దీంతో అభిమానులు అసహనం కి గురయ్యారు. అసలు గేమ్ చేంజర్ చిత్రం మీద నీకు ఆసక్తి ఉందా?, అంత బలవంతంగా ఈ ట్వీట్ వెయ్యడం కూడా ఎందుకు, డిలీట్ చేసేయ్ అంటూ శంకర్ ని తిడుతున్నారు.
ఇది ఇలా ఉండగా మూడు రోజుల క్రితం రామ్ చరణ్ అభిమానులు డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజు ని ట్యాగ్ చేసి నేషనల్ వైడ్ గా రీసౌండ్ వచ్చేలా ఒక నెగటివ్ ట్రెండ్ చేసారు. ఇది మూవీ టీం వరకు వెళ్ళింది, సంగీత దర్శకుడు థమన్ కూడా రామ్ చరణ్ అభిమానులు చేసిన పనికి బాధపడ్డాడు. శంకర్ కూడా ఆ బాధతోనే ఇలా మొక్కుబడిగా ‘గేమ్ చేంజర్’ మూవీ పోస్టర్ ని అప్లోడ్ చేశాడా? అనే సందేహాలు పుడుతున్నాయి.
— Shankar Shanmugham (@shankarshanmugh) September 7, 2024