https://oktelugu.com/

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీలో విలన్ గా చేయనున్న ఇద్దరు స్టార్ హీరోలు…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. ఇక ప్రభాస్ లాంటి నటుడు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు... బాహుబలి సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాడు...

Written By: , Updated On : February 21, 2025 / 08:11 AM IST
Spirit

Spirit

Follow us on

Sandeep Reddy Vanga : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga)… ఈయన చేస్తున్న సినిమాలన్నీ సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఈయన చేసిన రెండు సినిమాలు భారీ విజయాలను సాధించడమే కాకుండా పాన్ ఇండియాలో ఆయన కంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా ఏర్పాటు చేసి పెట్టాయనే చెప్పాలి. సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరెవరు ఉండరనేది వాస్తవం… ఎందుకంటే ఆయన డిఫరెంట్ గా మాట్లాడుతాడు, డిఫరెంట్ గా సినిమాలను చేస్తాడు. ప్రెస్ మీట్ లలో కూడా ప్రతి ఒక్కరికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ అన్ని రకాలుగా ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించి ప్రభాస్ కి తన కెరియర్లో గుర్తుండిపోయే ఇండస్ట్రీ హిట్ ను ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్కును ఏర్పాటు చేసుకోవడం తద్వారా తను చేయబోయే సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉండడం అనేది యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి నచ్చింది.

మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక సూపర్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ వస్తున్న ఈ దర్శకుడి సినిమాలు చూడాలంటే కొంతవరకు గట్స్ ఉండాలి… ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న స్పిరిట్ (Spirit) సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలను విలన్స్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో ఒకరు తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన విశాల్ కాగా, మరొకరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న గోపీచంద్ (Gopi Chand) కావడం విశేషం… అయితే వీరిద్దరిని ఈ సినిమాలో విలన్స్ గా చూపించాలనే ప్రయత్నంలో సందీప్ రెడ్డివంగ (Sandeep Reddy Vanga) ఉన్నారట.

గోపీచంద్ కూడా ప్రభాస్ సినిమాలో విలన్ గా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నానని చాలా సందర్భాల్లో తెలియజేశాడు. గోపీచంద్ ప్రభాస్ మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే. ఇక వర్షం సినిమాలో కూడా వీళ్ళిద్దరూ హీరో విలన్లుగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. మరోసారి వీళ్ళు కలిసిన నటిస్తారా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…