Tollywood Star Heroes: కంటెంట్ లేని సినిమాలను ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా కాపాడలేడు, ఇది దశాబ్దాల నుండి మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఎంత కంటెంట్ లేని సినిమాకు అయినా స్టార్ హీరోల స్టార్ పవర్ కారణంగా ఓపెనింగ్ వసూళ్లు వస్తుంటాయి. వాటితోనే మొదటి వీకెండ్ లో సగానికి పైగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటూ ఉంటారు. కానీ దురదృష్టం కొద్దీ కొన్ని స్టార్ హీరోల సినిమాలు కనీసం ఓపెనింగ్స్ ని కూడా సొంతం చేసుకోలేక, 50 కోట్ల రూపాయిల లోపే షేర్ వసూళ్లతో క్లోజ్ అయిపోయాయి. వాటి గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. ఆ సినిమాలేంటో ఒకసారి చూద్దాం.
Also Read: 5వ రోజు హిందీ లో కూడా భారీగా పడిపోయిన ‘వార్ 2’ వసూళ్లు..తెలుగులో అయితే క్లోజ్!
నా పేరు సూర్య:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun), వక్కంతం వంశీ కాంబినేషన్ లో నాగబాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం 2018 వ సంవత్సరం, సమ్మర్ కానుకగా విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. సినిమాలో కథ మంచిగానే ఉన్నప్పటికీ టేకింగ్ విషయం లో డైరెక్టర్ బాగా తడబడ్డాడు. ఫలితంగా సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 48 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అల్లు అర్జున్ కెరీర్ లో చివరి ఫ్లాప్ చిత్రం ఇదే. ఆ తర్వాత ఆయన ‘అలా వైకుంఠపురంలో’, ‘పుష్ప’ సిరీస్ లతో ఎలాంటి ప్రభంజనం సృష్టించాడో మనమంతా చూశాము.
ఆచార్య:
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టింది. అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూసిన ఈ కాంబినేషన్ విఫలం అవ్వడం అనేది,మెగా ఫ్యాన్స్ కి ఒక పీడకల లాంటిది. ఈ చిత్రానికి ఓపెనింగ్ వసూళ్లు బాగానే వచ్చినప్పటికీ, క్లోజింగ్ మాత్రం దారుణంగా ఉన్నింది. ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 46 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. #RRR సినిమా థియేటర్స్ లో రన్ అవుతున్న సమయంలోనే , రామ్ చరణ్ నుండి విడుదలైన చిత్రమిది. ఇందులో హీరో మెగాస్టార్ చిరంజీవి అయినప్పటికీ, సెకండ్ హాఫ్ మొత్తం రామ్ చరణ్ ఉంటాడు కాబట్టి ఆయన ఖాతాలోకి కూడా ఈ చిత్రం చేరింది.
వార్ 2:
ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ క్రేజీ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ లో దారుణమైన వసూళ్లు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతానికి ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. క్లోజింగ్ లో 40 కోట్ల రూపాయిలు, వరల్డ్ వైడ్ తెలుగు వెర్షన్ క్లోజింగ్ వసూళ్లు 44 కోట్ల రూపాయిలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.