https://oktelugu.com/

Star Heroes: సినిమాలతో పాటు బిజినెస్‌లోనూ రాణిస్తున్న స్టార్ హీరోస్ వీళ్లే..

Star Heroes: ఒకప్పటిలాగా కాకుండా ప్రజెంట్ స్టార్ హీరోస్ మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తున్నారని చెప్పొచ్చు. ఓ వైపు సినిమా రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ వ్యాపారంలోనూ అడుగు పెట్టి అక్కడా సక్సెస్ అవుతున్నారు. అలా తమ సత్తా చాటుతున్న స్టార్ హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలుసు. మహేశ్ సినిమాల కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. కాగా, హీరోగా కొనసాగుతూనే మహేశ్.. […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 3, 2022 / 11:42 AM IST
    Follow us on

    Star Heroes: ఒకప్పటిలాగా కాకుండా ప్రజెంట్ స్టార్ హీరోస్ మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తున్నారని చెప్పొచ్చు. ఓ వైపు సినిమా రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ వ్యాపారంలోనూ అడుగు పెట్టి అక్కడా సక్సెస్ అవుతున్నారు. అలా తమ సత్తా చాటుతున్న స్టార్ హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

    mahesh babu

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలుసు. మహేశ్ సినిమాల కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. కాగా, హీరోగా కొనసాగుతూనే మహేశ్.. ప్రొడ్యూసర్‌గానూ రాణిస్తున్నారు. ఏఎంబీ సినిమాస్ పేరిట మల్టీ ప్లెక్స్ కూడా రన్ చేస్తున్నాడు మహేశ్. ఇకపోతే మహేశ్ బిజినెస్ యాక్టివిటీస్‌ అన్నిటినీ తన భార్య నమ్రత చూసుకుంటుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా సక్సెస్ అయి సెన్సేషన్ అయిపోయాడని చెప్పొచ్చు. ‘రౌడీ’ పేరుతో క్లోత్ బ్రాండ్ స్టార్ట్ చేసిన విజయ్.. ఏవీడీ సినిమాస్ పేరిట తెలంగాణలోని మహబూబ్ నగర్‌లో మల్టిప్లెక్స్ కన్ స్ట్రక్ట్ చేశాడు.

    Vijay Deverakonda

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లో పబ్ బిజినెస్‌లోకి దిగాడు. హైదరాబాద్‌లోనే ‘ఏఏఏ’ పేరిట మల్టీ ప్లెక్స్ నిర్మిస్తున్నాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సైతం హీరోగా ఉంటూనే వేరే వ్యాపారంలోకి అడుగు పెట్టాడు.పలు సినిమాలను సక్సెస్ ఫుల్‌గా ప్రొడ్యూస్ చేసిన చరణ్..ట్రూ జెట్ అనే విమాన సంస్థ బిజినెస్‌లోనూ ఉన్నాడు.

    Also Read:  ఒక్కటిగా ఉంటేనే సినిమా బ్రతుకుతుంది.. మోహన్ బాబు సుదీర్ఘ లేఖ !

    నాగార్జున ఎప్పటి నుంచో బిజినెస్ మ్యాన్‌గా ఉన్నాడు. సక్సెస్ ఫుల్‌ హీరోగా ఉంటూనే నాగార్జున రేసింగ్ కంపెనీలో, మాటీవీలో భాగస్వామిగా ఉన్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత ఉంటూ ఫుట్ బాల్ టీం కూడా ఓన్ చేస్తున్నాడు.మెగాస్టార్ చిరంజీవి క్రికెటర్ సచిన్‌తో కలిసి ఓ ఫుట్ బాల్ టీమ్ కొనుగోలు చేశాడు. హీరోగా సక్సెస్ అయిన చాలా కాలం తర్వాత చిరు.. బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. ఇక యంగ్ హీరో సందీప్ కిషన్ ‘వివాహ భోజనంబు’ అనే రెస్టారెంట్ హైదరాబాద్‌లో స్టార్ట్ చేశాడు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ‘బీ ఇస్మార్ట్’ అనే క్లోత్స్ కంపెనీని స్టార్ట్ చేసి వ్యాపారంలోకి దిగాడు.

    Also Read:   ప్రభాస్ 3.. బన్నీ 2.. లెక్క సరి చేద్దామనుకున్న ఎన్టీఆర్, చరణ్ ఆశలపై నీళ్లు

    Tags