https://oktelugu.com/

Star Heroes : ఈ సమ్మర్ కి పెద్ద హీరోలెవ్వరు రావడం లేదా..? వేసవిని లైట్ తీసుకుంటున్న స్టార్ హీరోలు…

Star Heroes : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది నిర్మాతలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు...

Written By: , Updated On : February 28, 2025 / 12:14 PM IST
Star Heroes

Star Heroes

Follow us on

Star Heroes : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది నిర్మాతలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు… ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ శాశిస్తుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది…మరికొద్ది రోజుల్లో మన ఇండస్ట్రీ ఇండియాలోనే నెంబర్ వన్ ఇండస్ట్రీ గా మారబోతుందనేది వాస్తవం…

ఒకప్పుడు సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పండగ వాతావరణం నెలకొనేది. కాలేజీ స్టూడెంట్స్ కి హాలిడేస్ ఉండడం వల్ల చాలామంది సినిమాలు చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండేవారు. అందువల్ల మేకర్స్ సైతం ఎక్కువ సంఖ్యలో సినిమాలను రిలీజ్ చేస్తూ ఉండేవారు. కానీ గత రెండు మూడు సంవత్సరాల నుంచి సమ్మర్ సీజన్ అంటే హీరోలు దర్శకులు ఎవరు పట్టించుకోవడం లేదు. స్టార్ హీరోలైతే మొత్తానికే సమ్మర్ సీజన్ ను మర్చిపోయినట్టుగా కనిపిస్తున్నారు. ఈ సంవత్సరం సమ్మర్ కి ప్రభాస్ రాజాసాబ్, విశ్వంభర సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తారని అందరూ మంచి అంచనాలను పెట్టుకున్నారు. కానీ అవేవీ వర్కౌట్ అయ్యే విధంగా కనిపించడం లేదు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల షూటింగ్ లు ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో ఇప్పుడప్పుడే ఈ సినిమాలు థియేటర్లోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలతో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్న ఈ స్టార్ హీరోలు సమ్మర్ కి వచ్చుంటే మంచి విజయాన్ని సాధించేవారని కొంతమంది అంటుంటే మరి కొంతమంది ఐపిఎల్ సీజన్ వల్ల సమ్మర్లో ఎక్కువగా సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Also Read : పీపుల్స్ మీడియా బ్యానర్ ను కాపాడాల్సిన బాధ్యత ఆ స్టార్ హీరో మీద మాత్రమే ఉందా..?

మరి ఏది ఏమైనా కూడా సమ్మర్ సీజన్ అనేది సినిమా ఇండస్ట్రీకి ఒకప్పుడు బాగా కలిసి వచ్చింది. మరి ఇప్పుడు దాన్ని నెగ్లెట్ చేయడం అనేది కొంతవరకు అందరిని బాధపెట్టే విషయమనే ని చెప్పాలి. మరి ఈ సమ్మర్ కి చిన్న సినిమాలైనా రిలీజ్ అయి వాళ్ళ స్టామినా ఏంటో చూపిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాయా? తద్వారా సినిమా ఇండస్ట్రీకి భారీ సక్సెస్ లను కట్టబెడతాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇప్పటికే ఈ సంవత్సరంలో రెండు నెలలు ముగుస్తున్న సందర్భంలో సంక్రాంతి సీజన్ లో వచ్చిన సినిమాలను మినహాయిస్తే మిగిలిన సినిమాలేవీ పెద్దగా వర్కౌట్ అయినట్టుగా కనిపించడం లేదు. ఇక సంక్రాంతికి వచ్చిన ‘ సంక్రాంతికి వస్తున్నాం’ , ‘డాకు మహరాజ్ ‘ రెండు సినిమాలు మాత్రమే భారీ విజయాలను సాధించాయి…

ఇక మీదట వచ్చే సినిమాలు భారీ విజయాలను సాధించి వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చాలామంది దర్శక నిర్మాతలు కోరుకుంటున్నారు. ఈ సంవత్సరం సమ్మర్ ను మినహాయిస్తే మిగిలిన సీజన్స్ పెద్ద సినిమాలకు బాగా కలిసి వస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Also Read : అయోధ్య ప్రారంభోత్సవం… చిరు, ప్రభాస్ లకు ఊహించని అరుదైన గౌరవం