Star Heroes
Star Heroes : ఇప్పటివరకు స్టార్ హీరోలందరు వరుసగా సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ ఇక మీదట మంచి కథలతో సినిమాలు చేయడానికి రంగ సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలకంటే మంచి కథతో వచ్చిన సినిమాలనే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. తద్వారా సినిమా వసూళ్లను కూడా భారీ రేంజ్ లో కలెక్ట్ చేస్తూ ముందుకు సాగుతున్నాయి. అందువల్ల ప్రతి హీరో కాన్సెప్ట్ బెస్డ్ సినిమాలను చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…
సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ చాలా కీలకం. ఒక దర్శకుడు కథని స్క్రీన్ మీద విజువల్ గా చూపించాలంటే భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమైతే ఉంది. దానికి ప్రొడ్యూసర్ అనే ఆయన చాలా ముఖ్యం…ఆయన లేకపోతే సినిమా అనేది సెట్స్ మీదకి వెళ్ళలేదు. కాబట్టి ప్రొడ్యూసర్ సినిమాకి చాలా దేవుళ్లనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలోనే ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ అధినేత ఆయన ‘టీజీ విశ్వప్రసాద్’ (TG Vishwa Prasad) వరుసగా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే 2024 వ సంవత్సరంలో వాళ్ళ బ్యానర్ నుంచి చాలా సినిమాలు వచ్చినప్పటికి వచ్చిన సినిమాలు వచ్చినట్టుగా వెళ్ళిపోతున్నాయి తప్ప ఒక్క సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధించడం లేదు. అయితే 100 సినిమాలు చేయడమే టార్గెట్ గా పెట్టుకున్న వాళ్లు వరుస సినిమాలను దూకుడుగా చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ బ్యానర్ కి 2024వ సంవత్సరంలో 100 కోట్ల వరకు నష్టాలు వచ్చాయంటూ ఈ బ్యానర్ అధినేత టీజీ విశ్వప్రసాద్ తెలియజేయడం విశేషం…
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం నష్టాల్లో ఉన్న బ్యానర్ ను కాపాడాల్సిన ఏకైక బాధ్యత కూడా ప్రభాస్ మీద ఉందని చెప్పాలి. ప్రభాస్(Prabhas), మారుతి (Maruthi) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ (Rajasaab) సినిమా కూడా ఈ బ్యానర్ లోనే వస్తుంది. మరి ఆ సినిమా రిలీజ్ అయితే దాదాపు 600 నుంచి 700 కోట్ల వరకు కలెక్షన్స్ కొల్లగోడుతుందనే అంచనాలో ట్రేడ్ పండితులైతే ఉన్నారు.
కాబట్టి వాటితో నష్టాలను తీర్చుకొని మరోసారి మంచి సినిమాలు చేసి ఇండస్ట్రీ లో చాలా స్ట్రాంగ్ గా నిలబడాలనే ప్రయత్నంలో ఈ ప్రొడక్షన్ హౌస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనుకున్న టీజీ విశ్వప్రసాద్ అనవసరమైన కథలను సినిమాలుగా చేస్తూ ముందుకు తీసుకెళ్లడంలో కొంతవరకు తను విఫలమయ్యాడనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఇక 100 సినిమాలు చేయాలనే టార్గెట్ పెట్టుకోవడం వల్లే ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించాడు తప్ప కథలో క్వాలిటీ ఉందా? డైరెక్షన్ లో క్లారిటీ ఉందా అనే విషయాలను సరిగ్గా తెలుసుకోలేకపోయాడు. ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించి తమ బ్యానర్ ని టాప్ పొజిషన్ లో నిలపాలనే ప్రయత్నంలో టిజి విశ్వ ప్రసాద్ ఉన్నట్టుగా తెలుస్తోంది…