https://oktelugu.com/

Balakrishna: బాలయ్య 50 ఇయర్స్ ఇండస్ట్రీ ఈవెంట్ కి హాజరు కానీ స్టార్ హీరోలు వీళ్లే…

బాలయ్య బాబు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా ఎదగడమే కాకుండా తనకంటూ ఒక మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు... ప్రస్తుతం ఇండస్ట్రీ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : September 2, 2024 / 04:32 PM IST

    Balakrishna(2)

    Follow us on

    Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఆయనను చాలా ఉన్నతమైన స్థానంలో నిలపడమే కాకుండా ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి. అలాంటి నందమూరి నటసింహం ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఒక ఈవెంట్ ను కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు… ఇక దానికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాగా, వెంకటేష్ కూడా ఈవెంట్ కి హాజరై ఈ ప్రోగ్రాం ను ఘనవిజయం చేయడంలో కీలకపాత్ర వహించాడు. అయితే బాలయ్య బాబు ఈవెంట్ కి అనుకున్న రేంజ్ లో సెలబ్రిటీలు రాలేదు అనేది మాత్రం చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య, అఖిల్ ఎవరో ఒకరు వస్తారని అందరూ అనుకున్నప్పటికీ వాళ్ళిద్దరిలో ఎవరు రాలేదు.

    ఇక నాగార్జున ఈవెంట్ కు రాడనే విషయం మనకు తెలిసిందే. ఇక నందమూరి హీరోలైనా కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీయార్లు కూడా వాళ్ళ సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఈవెంట్ కి రాలేకపోయారు అనేది చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు సైతం ప్రత్యేకమైన ఆహ్వానాలు అందినప్పటికీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలను కాపాడడానికి వీళ్లు చాలా వరకు ముందు అడుగు వేస్తూ ముందుకు సాగారు. కాబట్టి ఈ ఈవెంట్ కి హాజరు కాలేకపోయారనేది వాస్తవం…

    ఇక మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ లు కూడా హాజరు కాలేకపోయారు..ఇక వీళ్ళందరూ వచ్చి ఉంటే ఈవెంట్ ఇంకా చాలా గ్రాండ్ గా జరిగి ఉండేదని బాలయ్య బాబు అభిమానులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కానీ మొత్తానికైతే బాలయ్య బాబు 50 సంవత్సరాల ఈ ఈవెంట్లో చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలువగా చిరంజీవి మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చిరంజీవి బాలయ్య బాబులకు ఒకప్పుడు సినిమాల పరంగా చాలా పోటీ అయితే ఉండేది.

    కానీ ఇప్పుడు వాళ్ల మధ్య మంచి సన్నిహితమైన సంబంధాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే బాలయ్య బాబు గురించి చిరంజీవి మాట్లాడిన మాటలు చాలా గొప్పగా ఉండటమే కాకుండా అభిమానులకు ఆనందాన్ని కూడా కలిగిస్తున్నాయి. ఇక మల్టీ స్టారర్ సినిమా చేయడానికి అటు బాలయ్య, ఇటు చిరంజీవి ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది…