Mr Celebrity Teaser: వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో వరుస చిత్రాలు చేస్తున్నారు. ఆమె కీలక రోల్స్ చేసిన పలు చిత్రాలు విజయం సాధించాయి. క్రాక్, యశోద, వీరసింహారెడ్డి ఆమెకు ఫేమ్ తెచ్చిపెట్టాయి. విలన్ రోల్స్ తో పాటు క్యారెక్టర్ రోల్స్ సైతం చేస్తుంది. 2024 సంక్రాంతి విన్నర్ హనుమాన్ చిత్రం లో హీరో తేజ సజ్జ అక్క పాత్రలో నటించి మెప్పించింది. ఆమె నుండి వస్తున్న మరో తెలుగు చిత్రం మిస్టర్ సెలబ్రిటీ. సుదర్శన్ పరుచూరి, శ్రీ దీక్ష, ఇతర ప్రధాన పాత్రలు చేశారు.
ఆమని, రఘుబాబు, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. మిస్టర్ సెలబ్రిటీ మూవీ విడుదలకు సిద్ధం అవుతుండగా చిత్ర యూనిట్ టీజర్ విడుదల చేశారు. మిస్టర్ సెలబ్రిటీ టీజర్ వరలక్ష్మి శరత్ కుమార్ వాయిస్ ఓవర్ తో మొదలైంది. అలనాడు రాముడు సీతకు అగ్ని పరీక్ష పెట్టాడు. ఒక చాకలి లేపిన పుకారు విని సీతతో అరణ్యవాసం చేయించాడు. ఈ పుకార్ల కారణంగా ఎందరో బలి అవుతున్నారని అర్థం వచ్చేలా ఆమె వాయిస్ ఓవర్ డైలాగ్ ఉంది.
కాబట్టి ఈ మూవీ ఓ వర్గం టార్గెట్ గా, సెటైరికల్ గా మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. సినిమా ఇంటెన్స్ థ్రిల్లర్. మాస్క్ ధరించి ఓ వ్యక్తి మారణహోమానికి పాల్పడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు కొందరిని చంపుతున్నాడు? అనేది మిగతా కథ. కథలో ట్విస్ట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆసక్తి రేపే అంశాలు. టీజర్ రిచ్ గా ఉంది. విజువల్స్ బాగున్నాయి. ప్రధాన నటుల క్యారెక్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.
మిస్టర్ సెలబ్రిటీ చిత్రానికి చాందిని రవి కిషోర్ దర్శకుడు. ఎన్ పాండురంగారావు నిర్మించారు. వినోద్ యాజమాన్య సంగీతం అందించారు. మిస్టర్ సెలబ్రిటీ టీజర్ విడుదల నేపథ్యంలో యూనిట్ సభ్యులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మిస్టర్ సెలబ్రిటీ ప్రేక్షకులను మెప్పిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ లక్కీ చార్మ్ గా అవతరించింది. ఆమె సెంటిమెంట్ మిస్టర్ సెలబ్రిటీ చిత్రాన్ని కూడా హిట్ గా మలుస్తుందేమో చూడాలి..