Chaitu-Sam: పెళ్ళికి ముందు చైతన్యను సమంత బెదిరించిందా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మేటర్!

వీరిది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. ' ఏమాయ చేసావే ' సినిమా సెట్స్ లో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. చాలా కాలం రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు.

Written By: S Reddy, Updated On : April 10, 2024 12:45 pm

Samantha threaten Naga Chaitanya

Follow us on

Chaitu-Sam: సమంత – నాగ చైతన్య ఒకప్పటి టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్. 2018లో ఘనంగా వివాహం చేసుకున్నారు. గోవా వేదికగా హిందూ, క్రిస్టియన్ రెండు సంప్రదాయాల్లో వీరి పెళ్లి జరిగింది. కానీ కొంతకాలానికి వారి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. 2021లో విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కెరీర్ పై ఫోకస్ చేస్తూ ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు. కాగా సమంత – నాగ చైతన్య విడిపోయిన సమయంలో ఎన్నో రకాల రూమర్స్ వచ్చాయి.

ముఖ్యంగా సమంతను తప్పు పడుతూ కొందరు ఆమెను దారుణంగా టార్గెట్ చేశారు. విపరీతంగా ట్రోల్ చేశారు. సమంత ఫ్యాన్స్ మాత్రం ఆమెను వెనకేసుకొచ్చారు. తప్పంతా నాగ చైతన్య దే అంటూ సమంత కు సపోర్ట్ చేశారు. సోషల్ మీడియాలో సామ్ – చెయ్ ఫ్యాన్స్ మధ్య అప్పట్లో పెద్ద యుద్ధమే జరిగింది. అయితే ఇప్పటికీ వారు ఎందుకు విడిపోయారనే కారణాలు ఎవరికీ తెలియవు. వాళ్ళు మళ్ళీ కలిస్తే చూడాలని ఫ్యాన్స్ చాలా కోరుకుంటున్నారు.

వీరిది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. ‘ ఏమాయ చేసావే ‘ సినిమా సెట్స్ లో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. చాలా కాలం రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు. కాగా లవ్ చేసుకుంటున్న సమయంలో సమంత ఓ విషయంలో నాగ చైతన్య ని బెదిరించిందట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

నాగ చైతన్య ని ప్రేమిస్తున్నట్లు సమంత తన ఇంట్లో చెప్పి ఒప్పించిందట. కానీ నాగ చైతన్య తండ్రి నాగార్జునకు భయంతో చెప్పడం లేదట. రోజులు గడుస్తున్నా నాగ చైతన్య సైలెంట్ గా ఉండటంతో .. సమంతకు కోపం వచ్చిందట. మన ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పకపోతే .. నేను నీకు రాఖీ కడతానని బెదిరించిందట. అన్నంత పని చేస్తుంది భయపడిన నాగ చైతన్య లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పగా .. నాగార్జున కూడా ఓకే అన్నారట. దాంతో వారి పెళ్లి జరిగింది.