https://oktelugu.com/

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగ తో సినిమా చేయాలని ఉంది అంటున్న స్టార్ హీరో…

సినిమా ఇండస్ట్రీ లో ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే అది పూర్తిగా దర్శకుడు చేతిలోనే ఉంటుంది. ఇక దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా దర్శకుడు దగ్గరుండి మరి చూసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది. ఇక ఏది ఏమైనా కూడా తన సినిమాలతో దర్శకులు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాల్సిన అవసరం అయితే ఉంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 3, 2024 / 11:26 AM IST

    Sandeep Reddy Vanga about Spirit Movie

    Follow us on

    Sandeep Reddy Vanga: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ డైరెక్టర్ గా తనకంటూ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా బోల్డ్ కంటెంట్ తోనే ముందుకు దూసుకెళుతున్నాయి. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కూడా ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన వరుస సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన ఇండస్ట్రీ కి చాలా వరకు కలిసి వస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఈ ట్రెండుకు తగ్గట్టుగా సినిమాలను చేయడం వల్లే ఇండియాలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు కూడా అతనికి కనెక్ట్ అవుతున్నాడు. నిజానికి ఈ జనరేషన్ లో ఉన్న ప్రేక్షకుల మనోభావాలను అద్దం పట్టేలా సినిమా చేసి చూపించడంలో ఆయన సక్సెస్ ఫుల్ దర్శకుడుగా మారాడు. కాబట్టి ఆయన చేసే ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక బోల్డ్ కంటెంట్ అయితే ఉంటుందని తను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాంటి కంటెంట్ లేకపోతే ఆయన సినిమా చేయనని కూడా చెప్పాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయనతో సినిమా చేయడానికి చాలామంది హీరోలు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ముఖ్యంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న సూర్య కూడా సందీప్ రెడ్డి వంగాతో ఒక సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే సూర్య చేసిన ‘కంగువా’ సినిమా ఈనెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న సూర్య సందీప్ వంగ తో సినిమా చేయాలని ఉంది అని తన మనసులోని మాటను బయట పెట్టడం విశేషం…

    ఇక మొత్తానికైతే ప్రస్తుతం సూర్య కంగువా సినిమాతో ఒక పెను సంచలనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడానికి ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండడం విశేషం…ఇక తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఆ సినిమా ఉంటుందని సినీ మేధావులు సైతం భావిస్తున్నారు.

    ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఈయన సినిమా చేస్తే ఆ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందనే చెప్పాలి. ఇక సూర్య కూడా ఎలాంటి నటనకైనా సరే అబ్జెక్షన్ చెప్పకుండా చాలా డీసెంట్ గా నటిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన కూడా సందీప్ వంగ సినిమాలకు బాగా సెట్ అవుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…