Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ గత కొద్దిరోజులుగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడు.ఈయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలా రోజులపాటు చాలా కష్టాలు అనుభవించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో తనకంటూ ఒక స్టార్ డమ్ ని ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో భారీ హిట్ ని సొంతం చేసుకున్నాడు…
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన చేసిన వరుస సినిమాలు ప్లాప్ అవ్వడం తో ఆయన భారీ హిట్ కొట్టడానికి ప్లాన్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ మాన్ సినిమా మీదనే ఆశలు పెట్టుకున్నాడు. అలాగే గౌతమ్ తిన్ననూరు డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కూడా చాలా మంచి విజయం సాధిస్తుందని చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నాడు.
ఇక ఈ రెండు సినిమాల తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో తనకి మంచి సక్సెస్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ ని తనతో ఒక సినిమా చేయమని కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈయన ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. కాబట్టి విజయ్ దేవరకొండ తో ఆయన ఇప్పుడు సినిమా చేయడం అనేది అసంభవం అనే చెప్పాలి. కానీ విజయ్ మాత్రం సందీప్ ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక వీళ్ళ కాంబో లో సినిమా కనక పడితే సూపర్ సక్సెస్ అవుతుందనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
కానీ ఇప్పుడు సందీప్ కి ఉన్న కమిట్ మెంట్స్ కి ఆయన విజయ్ తో సినిమా చేయాలంటే మాత్రం చాలా టైం పడుతుందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం సందీప్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు, ఈ సినిమా పూర్తి అయిన వెంటనే అల్లు అర్జున్ తో మరొక సినిమా చేయాల్సి ఉంది.ఇక ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిట్ అయిన సందీప్ ఇప్పుడప్పుడే విజయ్ తో సినిమా చేయడం అంటే కష్టం అనే చెప్పాలి.
మరి ఈ విషయంలో విజయ్ ఎలా స్పందిస్తాడు అనేది తెలియాల్సి ఉంది. నిజానికి విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డివంగ మంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ వీళ్ళు ఇద్దరు కలిసి అర్జున్ రెడ్డి తర్వాత మరొక సినిమా చేయలేదు. ఇక ఇప్పుడు విజయ్ సందీప్ తో సినిమా చేయాలని అనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం సందీప్ కి ఉన్న కమిట్ మెంట్స్ ప్రకారం ఇప్పుడైతే వీళ్ళిద్దరి కాంబోలో సినిమా అనేది తెరపైకి వచ్చే అవకాశాలు అయితే లేవు…