Paradise : న్యాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో నాని… శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఆయన చేసిన దసర (Dasara) సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాని పేరు మారుమ్రోగి పోయిందనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఏది ఏమైనా కూడా నాని లాంటి స్టార్ హీరో ఇప్పుడు చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను సాధించాలనే ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. ఇక అందులో భాగంగానే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. అందులో నాని రెండు జడలు వేసుకొని ఒక డిఫరెంట్ లుక్ లో మనకు దర్శనమిచ్చాడు. మరి ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుందంటూ ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల మంచి కాన్ఫిడెంట్ ను ని వ్యక్తం చేస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో పెను రికార్డులు క్రియేట్ అవుతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read : ప్యారడైజ్ సినిమా కోసం నాని తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారమైతే ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) విలన్ గా నటించబోతున్నాడనే సమాచారమైతే అందుతుంది. నిజానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విలన్ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుందట. అలాగే డిఫరెంట్ మోడ్యులేషన్ లో నటించాల్సిన అవసరం కూడా ఉందట.
అందుకోసమే మోహన్ బాబు అయితే అలాంటి మాటలు ఈజీగా పలికిస్తాడని చెప్పడం ఉద్దేశ్యంతోనే ఆయనను ఈ సినిమాలో విలన్ గా తీసుకున్నారు అంటూ ఈ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ విషయం మీద సినిమా యూనిట్ గాని, అటు మోహన్ బాబు గానీ ఎలాంటి స్పందనను తెలియజేయలేదు.
కాబట్టి ఈ విషయం మీద క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే ఈ మూవీ గ్లిమ్స్ తోనే ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డ్ లను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది…ఇక ఏది ఏమైనా కూడా నాని శ్రీకాంత్ ఓదెల ఇద్దరు కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు.చూడాలి మరి ఈ సినిమాతో వీళ్లిద్దరూ భారీ సక్సెస్ ను సాధిస్తారా లేదా అనేది…
Also Read : ప్యారడైజ్ సినిమాకోసం అనిరుధ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవుతారు…