Paradise : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. నాని లాంటి హీరో సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన కంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు… ఇక ఇప్పుడు చేయబోతున్న సినిమాలన్నీ మంచి విజయాలను సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…
శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో నాని (Nani) హీరోగా వచ్చిన దసర సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాతో యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాని క్రేజ్ భారీగా పెరిగింది. దాంతో పాటుగా మాస్ హీరోగా నాని ఒక కొత్త అవతారంలో కూడా కనిపించి ప్రేక్షకులందరిని మెప్పించాడు. మరిలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇప్పుడు ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరోసారి ప్యారడైజ్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ ప్రేక్షకులందరిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ను ఇచ్చింది. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read : ‘ది ప్యారడైజ్’ మూవీలో లో నాని మదర్ గా నటిస్తున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పెను ప్రభంజానాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన గ్లిమ్స్ తో తన మ్యూజిక్ లోని మ్యాజిక్ ని మరోసారి చూపించాడ.
దాంతో గ్లిమ్స్ అల్టిమేట్ గా నిలవడమే కాకుండా ఆ గ్లిమ్స్ చూసిన ప్రతి ఒక్కరు ఒకటికి రెండుసార్లు దాన్ని చూస్తున్నారు అంటే ఆయన అందించిన మ్యూజిక్ ఏ లెవెల్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నందుకుగాను అనిరుధ్ దాదాపు 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాతో మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన మార్కు చూపించాలనే ప్రయత్నంలో అనిరుధ్ మ్యూజిక్ విషయంలో గాని బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి మ్యూజిక్ ని అందించడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడట… చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ అయితే గాని అనిరుధ్ మ్యూజిక్ ఎలా ఉంది. ఆయన మ్యూజిక్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే విధంగా ఉందా లేదా అనేది తెలియదు…