Paradise
Paradise : సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు అందులో నాని ఒకరు. ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసి పెడుతున్నాయి. తద్వారా ఆయన సినిమాలకు భారీ క్రేజ్ రావడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా సంపాదించుకుంటున్నాడు… మొదటి సినిమా నుంచి ఇప్పుడు చేస్తున్న సినిమాల వరకు ఆయన చేసిన సినిమాల లైనప్ చాలా గొప్పగా ఉందనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు నాని(Nani)… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. తద్వారా మినిమం గ్యారంటీ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. తనతో సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ కి నష్టాలు రాకుండా చూసుకోవడంలో నాని మొదటి వరుసలో ఉంటాడు. ఎందుకంటే తనకు పెట్టిన బడ్జెట్ రికవరీ చేయడంలో ఆయన చాలావరకు క్రియాశీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటాడు. తద్వారా ఆయన తన సినిమాలతో ప్రొడ్యూసర్ ను సేఫ్ జోన్ లోనే ఉంచుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అందుకే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో మాత్రం ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఇక ఆయన సినిమాలను చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కూడా చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటార.ు తద్వారా ఆయన సినిమాలకు భారీ కలెక్షన్స్ కూడా వస్తుంటాయి.
Also Read : ప్యారడైజ్ సినిమాకోసం అనిరుధ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవుతారు…
దసర (Dasara), హాయ్ నాన్నా(Hai Nanna), సరిపోదా శనివారం (Saripodha shanivaaram) లాంటి సినిమాలతో మంచి విజయాలను సాధించి ఇప్పుడు మరోసారి హిట్ 3(Hit 3), ప్యారడైజ్ (Paradaise) సినిమాలతో భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలూస్తోంది. మరి ఈ సినిమాలతో ఆయన భారీ విజయాలను సాధించినట్టయితే తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా పాన్ ఇండియాలో కూడా తను చాలా పాపులారిటిని పొందిన హీరోగా పేరు సంపాదించుకుంటాడు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో చేస్తున్న ప్యారడైజ్ (Paradaise) సినిమా కోసం భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇంతకు ముందు వరకు నాని 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. కానీ ప్యారడైజ్ సినిమా కోసం ఏకంగా 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్ళబోతుందట. ఈ సినిమాలో నాని రెండు జడలు వేసుకొని చాలా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. తద్వారా ఈ సినిమా యావత్ ప్రేక్షకులందరిని అలరిస్తుందంటూ సినిమా యూనిట్ చాలావరకు కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తూ ఉండడం విశేషం…
Also Read : ‘ది ప్యారడైజ్’ మూవీలో లో నాని మదర్ గా నటిస్తున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?