https://oktelugu.com/

Anora OTT: ఓటీటీలోకి వచ్చేసిన 5 ఆస్కార్ అవార్డు విన్నింగ్ మూవీ

Anora OTT అనోరా మూవీలో మైకీ మ్యాడిసన్, మార్క్ ఇడిల్‍స్టెయిన్ మెయిన్ లీడ్‌లో నటించారు. సీన్ బేకర్ అనోరా మూవీకి దర్శకత్వం వహంచడంతో పాటు స్క్రీన్‍ప్లే, ఎడిటింగ్ కూడా చేశారు.

Written By: , Updated On : March 18, 2025 / 10:04 AM IST
Anora OTT

Anora OTT

Follow us on

Anora OTT: హాలీవుడ్ అనోరా (Anora) మూవీ ఓటీటీలోకి (OTT) వచ్చేసింది. ఐదు ఆస్కార్ అవార్డులు విన్ కావడంతో ఒక్కసారిగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ సినిమా మొత్తం ఐదు అవార్డులను (Five Awards) గెలిచింది. ఉత్తమ చిత్రం, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్‍ప్లే, బెస్ట్ ఎడిటింగ్, ఉత్తమ నటి ఇలా మొత్తం ఐదు విభాగాల్లోనూ సినిమా టాప్‌లో నిలిచింది. ఈ సినిమాలో మైకీ మ్యూడిసన్‍ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది. అయితే ఈ సినిమా మార్చి 17 అనగా నేడు జియో హాట్‍స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇంగ్లిష్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍ అవుతుంది. అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 ఓటీటీల్లో ఇప్పటికే రెంటల్ విధానంలో ఉంది. ఇప్పుడు జియో హాట్‍స్టార్ సబ్‍స్క్రిప్షన్ ఉన్నవారు ఎలాంటి రెంట్ చెల్లించకుండా ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో చూసేయవచ్చు. గతేడాది రిలీజ్ అయ్యిన ఈ సినిమాను దాదాపుగా 6 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. కలెక్షన్లు కూడా బాగా రాబట్టింది. మొత్తం 44 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టింది.

Also Read: ప్యారడైజ్ సినిమా లో ఆ స్టార్ హీరో విలన్ గా నటిస్తున్నాడా..?

అనోరా మూవీలో మైకీ మ్యాడిసన్, మార్క్ ఇడిల్‍స్టెయిన్ మెయిన్ లీడ్‌లో నటించారు. సీన్ బేకర్ అనోరా మూవీకి దర్శకత్వం వహంచడంతో పాటు స్క్రీన్‍ప్లే, ఎడిటింగ్ కూడా చేశారు. ఈ రెండు విభాగాల్లో కూడా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తీసిన ఈ సినిమాలో నటి అద్భుతంగా నటించింది. ఆమె నటనకు అవార్డు ఇచ్చారు. గతేడాది అక్టోబర్ 18వ ఈ అనోరా చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. దాదాపుగా 6 మిలియన్ డాలర్ల బడ్జెట్‍తో ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే 41 మిలియన్ల డాలర్లు ఈ సినిమాకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మైకీ మ్యాడిసన్ మెయిన్ లీడ్‌లో నటించారు. ఈమె ఒక వేశ్య. రష్యా పరిపాలకుడు కుమారుడు అయిన వన్య జాకరోవ్‍ (ఇడిల్‍ స్టెయిన్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు. వీరిని ఎలాగైనా విడగొట్టాలని జాకరోవ్ తల్లిదండ్రులు నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలోనే కొన్ని సన్నివేశాలు ఎదురు అవుతాయి. ఇలాంటి సమయంలో మిఖీవా ఏం చేసింది? ఆ తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చాయి? తను ఈ సమస్య నుంచి ఎలా బయట పడిందనే అన్ని విషయాలు కూడా తెలియాలంటే సినిమా ఓటీటీలో చూడాల్సిందే.