https://oktelugu.com/

Nabha Natesh: స్టార్ హీరో సినిమాలో ‘నభా నటేష్’.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ !

Nabha Natesh: ‘నభా నటేష్’ తెలుగు సినిమాల్లో చెప్పుకోదగ్గ ఛాన్స్ లు అందుకుని చాలా కాలమే అవుతుంది. అయితే నభా నటేష్ కి వేరే భాషల్లో బాగానే అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా పలు కన్నడ సినిమాలు చేసిన నభా నటేష్ , ఇప్పుడు మరో భారీ కన్నడ ప్రాజెక్ట్ ను దక్కించుకున్నట్లు కన్నడ మీడియా వర్గాలు ఓ వార్తను హైలైట్ చేస్తున్నాయి. కన్నడ స్టార్ హీరో ధృవ సర్జా కొత్త చిత్రంలో నభా నటేష్ హీరోయిన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : July 20, 2022 / 05:48 PM IST
    Follow us on

    Nabha Natesh: ‘నభా నటేష్’ తెలుగు సినిమాల్లో చెప్పుకోదగ్గ ఛాన్స్ లు అందుకుని చాలా కాలమే అవుతుంది. అయితే నభా నటేష్ కి వేరే భాషల్లో బాగానే అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా పలు కన్నడ సినిమాలు చేసిన నభా నటేష్ , ఇప్పుడు మరో భారీ కన్నడ ప్రాజెక్ట్ ను దక్కించుకున్నట్లు కన్నడ మీడియా వర్గాలు ఓ వార్తను హైలైట్ చేస్తున్నాయి.

    Nabha Natesh

    కన్నడ స్టార్ హీరో ధృవ సర్జా కొత్త చిత్రంలో నభా నటేష్ హీరోయిన్ గా చేస్తోందని ఆ వార్తల సారాంశం. పొగరు వంటి భారీ విజయం తర్వాత ధృవ సర్జా మళ్ళీ నంద కిషోర్ దర్శకత్వంలోనే మరో సినిమా చేస్తున్నాడు. పొగరు నిర్మించిన ప్రతాప్ రాజు ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. మరి ఇలాంటి క్రేజీ సినిమాలో నభా నటేష్ కి హీరోయిన్ ఛాన్స్ అంటే.. ఇది విశేషమే.

    ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా బెంగుళూరులో మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో సెకండ్ షెడ్యూల్ సాగుతోంది. ఈ షెడ్యూల్ లో నభా నటేష్ – ధృవ సర్జా పై కొన్ని లవ్ సీక్వెన్స్ లు తెరకెక్కిస్తున్నారు. ఐతే.. రేపటి నుంచి నభా నటేష్ కూడా యాక్షన్ షూట్ లో పాల్గొంది. ఆమె పై విలన్ అటాక్ చేస్తే.. ధృవ సర్జా వచ్చి సేవ్ చేసే సీన్ ను రేపటి నుంచి షూట్ చేస్తారు.

    Dhruva Sarja

    మరి నభా నటేష్ ది ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టరా ? లేక, సెకండ్ హీరోయిన్ లీడా ? అనేది చూడాలి. ఈ చిత్రంలో అయితే, ధృవ సర్జా డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ రెండు రోల్స్ లో ఒకటి నెగటివ్ రోల్ అని టాక్ నడుస్తోంది. ఈ సినిమా పై ధృవ సర్జా ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఇలాంటి భారీ సినిమాలో నభా నటేష్ మెయిన్ క్యారెక్టర్ చేస్తే ఆమె దశ తిరిగినట్టే.

    నిజానికి నభా నటేష్ కి టాలెంట్ లేకపోయినా ఫుల్ గ్లామర్ ఉంది. ఇక ఎక్స్ ప్రెషన్స్ పలికించలేకపోయనా ఫుల్ ఎక్స్ పోజింగ్ చేస్తోంది. అందుకే ఈ బబ్లీ బ్యూటీ నభా నటేష్ ఎలాగోలా కెరీర్ ను నెట్టుకొస్తూనే ఉంది.

    Tags