https://oktelugu.com/

Hansika: ప్రముఖ హీరోయిన్ హన్సిక పై స్టార్ హీరో లైంగిక వేధింపులు..బయటపడిన సంచలన నిజాలు!

ప్రముఖ హీరోయిన్ హన్సిక అప్పట్లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో తనకి ఎదురైన కొన్ని అనుభవాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ 'ఇండస్ట్రీ లో అందరి లాగానే నేను కూడా కొన్ని చేదు అనుభవాలను ఎదురుకోవాల్సి వచ్చింది. నేను మోడలింగ్ రంగం లో ఉన్నప్పుడు కొంతమంది డిజైనర్లు నాతో చాలా దురుసుగా ప్రవర్తించేవారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 19, 2024 / 08:02 PM IST

    Hansika

    Follow us on

    Hansika: ఇటీవలే ఒక యంగ్ డ్యాన్సర్ శ్రేష్టి వర్మ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నార్సింగి పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపుల కేసు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. జానీ మాస్టర్ తనపై అనేకసార్లు అత్యాచారం చేసేందుకు ప్రయత్నాలు చేసాడని, తనని పెళ్లి చేసుకోమని బెదిరిస్తున్నాడని, లేకుంటే ఇండస్ట్రీ లో అవకాశాలు లేకుండా చేస్తానని అంటున్నాడు అంటూ శ్రేష్టి వర్మ FIR లో పేర్కొనింది. ఈ ఘటన ఇండస్ట్రీ లో పెను దుమారం రేపింది. జానీ మాస్టర్ కి నిన్న మొన్నటి వరకు సపోర్టుగా నిల్చిన వారే నేడు వ్యతిరేకిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే జానీ మాస్టర్ ఘటన బయటకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ లో ప్రముఖ హీరోయిన్స్ గతం లో ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో లైంగిక వేధింపుల గురించి మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ వీడియోలు పోస్టు చేస్తున్నారు.

    అలా ప్రముఖ హీరోయిన్ హన్సిక అప్పట్లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో తనకి ఎదురైన కొన్ని అనుభవాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘ఇండస్ట్రీ లో అందరి లాగానే నేను కూడా కొన్ని చేదు అనుభవాలను ఎదురుకోవాల్సి వచ్చింది. నేను మోడలింగ్ రంగం లో ఉన్నప్పుడు కొంతమంది డిజైనర్లు నాతో చాలా దురుసుగా ప్రవర్తించేవారు. నేను కోరుకున్న డిజైన్ లో బట్టలు కావాలని అడిగితే, కుదరదు..ఇచ్చింది వేసుకో అని ముఖం మీదనే చెప్పేవారు. ఎవరితో నాతో అంత దురుసుగా మాట్లాడారో, ఈరోజు వాళ్ళే నాకు అసిస్టెంట్ డిజైనర్స్ గా వ్యవహరిస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఇండస్ట్రీ లో తనకి ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఆమె మాట్లాడుతూ ‘ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో ఒక స్టార్ హీరో నన్ను డేట్ కి వస్తావా అని అడిగాడు. నాకు ఇష్టం లేదని చెప్పాను, కానీ అతను మాట వినకుండా బలవంతం చేయబోయాడు. అతనికి తగిన రీతిలో బుద్ధి చెప్పాను. మళ్ళీ అతను నా జోలికి రావాలంటే భయపడ్డాడు. ఇండస్ట్రీ లోకి వచ్చే అమ్మాయిలు ఇలా ధైర్యంగా ఉండాలి, అప్పుడే వాళ్ళు భయపడతారు’ అంటూ చెప్పుకొచ్చింది హన్సిక.

    బాలనటిగా కెరీర్ ని మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళం, హిందీ మరియు మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈమె ‘దేశముదురు’ చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్న రోజుల్లో ఆమె వయస్సు కేవలం 15 ఏళ్ళు మాత్రమే. అప్పటి నుండి ఇప్పటి వరకు హన్సిక ఖాళీ గా ఉన్న రోజే లేదు. అలాంటి బిజీ హీరోయిన్ కూడా ఇండస్ట్రీ లోకి వచ్చిన ప్రారంభం లో ఇలాంటి ఘటనలను ఎదురుకుండా అని ఆమె అభిమానులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హన్సిక ఈటీవీ లో ప్రసారమయ్యే ‘ఢీ’ డ్యాన్స్ షో కి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది.