NTR: ఎన్టీఆర్ ముందర భారీ షేక్ చేసే ప్రాజెక్టులు… సక్సెస్ అయితే పాన్ ఇండియా స్టారే..

జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తన ఇమేజ్ ని కూడా భారీగా పెంచుకున్నాడు...

Written By: Gopi, Updated On : September 19, 2024 7:57 pm

NTR

Follow us on

NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా ప్రత్యేకమైన క్రేజ్ అయితే ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకులకు మంచి అంచనాలు ఉండడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇలాంటి క్రమం లోనే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ లో మంచి విజయాలను సాధించడమే కాకుండా ఇప్పటికే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను అందుకుంటున్నాయి. ఇక ఇదిలా ఉంటే దేవర సినిమాతో ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంటాడని అతని అభిమానులు ఆనందన్నైతే వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన తర్వాత చేయబోయే సినిమాల మీద కూడా అభిమానులకు భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీ లో మంచి విజయాలను అందుకుంటూ భారీ క్రేజ్ ను సంపాదించిపెట్టాయి.

ఇక ఇదిలా ఉంటే ఆయన దేవర సినిమా తర్వాత బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా వస్తున్న ‘వార్ 2’ ఒక హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమా మీద కూడా భారీ అంచానాలైతే ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి…ఇక ఈ సినిమాతో పాటు ఆయన పాన్ ఇండియా లో స్టార్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. తొందర్లోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుంది…

ఇక ఈ సినిమా తర్వాత తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన ‘వెట్రి మారన్’ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని ఉందని ఆయన రీసెంట్ గా తన మనసులోని అభిప్రాయాన్ని బయట పెట్టాడు. మరి ఆయన తెలియజేసిన నిర్ణయం పట్ల ఆయన కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ప్రస్తుతం దేవర సినిమా సక్సెస్ అయి రాబోయే సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ కనక తన సత్తా చాటి భారీ సక్సెస్ లను అందుకుంటే మాత్రం పాన్ ఇండియాలో ఎన్టీఆర్ హవా భారీగా కొనసాగుతుందనే చెప్పాలి. ఇక ఎన్టీఆర్ లైనప్ కనక చూసినట్లైతే స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమాలతో ఆయన ఎలాగైనా సరే భారీ సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నాడు…