https://oktelugu.com/

Sandeep Reddy Vanga : రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్స్ చూస్తే స్టార్ హీరోలు సైతం షాక్ అవ్వాల్సిందేనా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళ కంటు ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఒక నటుడుని స్టార్ హీరోగా మార్చడంలో దర్శకుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. వాళ్ళు చేసిన సినిమాలతోనే హీరోలు స్టార్ హీరోలుగా మారుతూ ఉంటారు...

Written By: , Updated On : February 21, 2025 / 08:31 AM IST
Sandeep Reddy Vanga , Prabhas

Sandeep Reddy Vanga , Prabhas

Follow us on

Sandeep Reddy Vanga : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రాజమౌళి(Rajamouli) దర్శక ధీరుడిగా పేర తెచ్చుకొని ఇండియా మొత్తం గర్వించదగ్గ దర్శకుడిగా మారాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన వేసిన మార్క్ అంతా ఇంతా కాదు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఇప్పించగలిగే సినిమాలను తీయడంలో ఆయన దిట్ట…ఇప్పటికే ఆయన మహేష్ బాబు(Mahesh Babu) ని హీరోగా పెట్టి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని అలరించడమే తన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని ని క్రియేట్ చేసుకొని భారీ గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న రాజమౌళి రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం అసలు తగ్గడం లేదట. మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి సక్సెస్ లో పర్సంటేజ్ ని తీసుకోవాలని చూస్తున్నాడు. ఒకవేళ పర్సంటేజ్ రూపం లో తీసుకున్నప్పటికి ఆయనకు రెండు నుంచి మూడు వందల కోట్ల వరకు డబ్బులు వచ్చే అవకాశాలైతే ఉన్నాయని కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

బోల్డ్ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డివంగ (Sandeep Reddy Vanga) ఆయన చేసే సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా యూత్ లో మంచి క్రేజ్ ను కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి. అందుకే సందీప్ రెడ్డివంగ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ప్రతి దర్శకుడు కూడా తనకి నచ్చిన జానర్ లో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటాడు. ఇక అలాగే సందీప్ రెడ్డి వంగ కూడా తనకు నచ్చిన జానర్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకుడిని అలారించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ప్రస్తుతం సినిమా చేస్తున్న సందీప్ రెడ్డివంగ ఒక సినిమా కోసం దాదాపు 80 నుంచి 90 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే టాక్ అయితే వినిపిస్తుంది…

కన్నడ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకొని దర్శకుడు ప్రశాంత్ నీల్(Peashanth Nee)… ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్…కేజీఎఫ్ సలార్ సినిమాలతో ఆయనకంటు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఒక భారీ సినిమాని చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రశాంత్ నీల్ సైతం ఒక సినిమా కోసం దాదాపు 100 కోట్ల వరకు రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడనే టాక్ అయితే వినిపిస్తుంది…