Dhanush: హీరో ధనుష్ కు నటుడిగా మంచి పేరు ఉంది. అలాగే వ్యక్తిత్వం పరంగా కూడా ధనుష్ పై మంచి అభిప్రాయం ఉంది. అందుకే, తమిళ ఇండస్ట్రీలో ధనుష్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఓ దశలో ధనుష్ డేట్స్ దొరకడం గగనం అయిపోయింది. ఇప్పటికీ ధనుష్ డేట్స్ కోసం తమిళ నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధనుష్ తెలుగు సినిమాల పై ప్రేమను పెంచుకున్నాడు.

ఇక్కడే తమిళ నిర్మాతలకు నచ్చలేదు. ధనుష్(Dhanush) కి తెలుగు పిచ్చి పట్టుకుంది అంటూ సెటైర్లు వేశారు. తమిళ్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయిస్తున్నారు. కారణం.. ధనుష్ ఏరి కోరి తెలుగు నిర్మాతలతో ద్విభాషా చిత్రాలు చేస్తున్నాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం తెరకెక్కబోతుంది.
ఇక ఈ సినిమాతో పాటు ధనుష్ మరో తెలుగు సినిమాకి కూడా ఓకే చెప్పాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార సంస్థ’ నిర్మణంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకి చందు మొండేటి దర్శకుడు అని తెలస్తోంది. నిజానికి శేఖర్ కమ్ముల సినిమా తర్వాత ధనుష్ ఓ తమిళ సినిమా చేస్తాను అని కమిట్ అయ్యాడు. కానీ ఇప్పుడు చందు మొండేటి తో సినిమా అంటే.. మరో ఏడాది వరకు ధనుష్ తమిళ సినిమా స్టార్ట్ కాదు.
అందుకే తమిళ నిర్మాతలు ఈ విషయంలో ధనుష్ పై సీరియస్ గా ఉన్నారు. ఇంతకీ ధనుష్(Dhanush) తమిళ నిర్మాతలు కంటే.. తెలుగు దర్శనిర్మాతలతో సినిమాలు చేయడానికి కారణం.. భారీ పారితోషికమే. తమిళంలో ధనుష్ కి ఎలాగూ మార్కెట్ ఉంది. అదే తెలుగు దర్శనిర్మాతలతో సినిమా చేస్తే.. తెలుగులో కూడా సినిమాకి ఫుల్ మార్కెట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొందరు నిర్మాతలు ధనుష్ కి రెట్టింపు పారితోషికం ఆఫర్ చేశారు.
ఆ పారితోషికం కారణంగానే ధనుష్ సినిమాల ఎంపిక మారింది. అయితే, ‘ఒక స్టార్ హీరో అయి ఉండి, ఇలా డబ్బులు కోసం కక్కుర్తి పడి, మాతృభాషకు ద్రోహం చేస్తావా ?’ అంటూ తమిళ నెటిజన్లు ధనుష్ పై విరుచుకు పడుతున్నారు. ధనుష్ మాత్రం సైలెంట్ గా తన సినిమాలు తాను చేసుకుంటూ పోతున్నాడు.