Radhika -Rashmika: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సీనియర్ నటి రాధిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో తల్లి పాత్రలను పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే రాధిక, ఖుష్బూ,ఊర్వశి ముగ్గురు సీనియర్ హీరోయిన్లు కలిసి నటిస్తున్నటువంటి చిత్రం “ఆడాళ్ళు మీకు జోహార్లు”. ఈ సినిమాలో శర్వానంద్ రష్మిక జంటగా నటిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటోంది.
ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇందులో నటిస్తున్నటువంటి సీనియర్ హీరోయిన్ రాధిక నేడు ట్విట్టర్ ద్వారా ఒక వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://twitter.com/realradikaa/status/1445995357289156610?t=XtPKxjCqYgBNkNPOV417-g&s=08
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న వీరందరూ షూటింగ్ లేని సమయంలో ఎంతో సరదాగా ఈ వీడియోని చిత్రీకరించారు. ఈ వీడియోలో భాగంగా నవరాత్రి, శుభరాత్రి అంటూ రష్మికను మధ్యలో ఉంచి నటి రాధిక, ఊర్వశి పాట పాడుతూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే రేష్మిక తెలుగులో శర్వానంద్ సరసన ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాతో పాటు, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన “పుష్ప” అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా రెండు బాలీవుడ్ చిత్రాల్లో కూడా ఈమె నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.