https://oktelugu.com/

Amita Bachchan : ఇల్లు తో పాటు అన్ని కోల్పోయిన స్టార్ హీరో…కట్ చేస్తే బాలీవుడ్ ను షేక్ చేశాడుగా…

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది లెజెండరీ యాక్టర్స్ ఉన్నప్పటికీ రజినీకాంత్, అమితాబచ్చన్ ల గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్లు ఒక తరం మొత్తాన్ని తమ సినిమాలతో అలరించడమే కాకుండా ప్రేక్షకులందరిని మెప్పించడంలో వీళ్ళు ఇప్పటికి సక్సెస్ అవుతూనే వస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 21, 2024 / 09:45 PM IST

    Amita Bachchan

    Follow us on

    Amita Bachchan : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు రజనీకాంత్… ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు విజయాలను సాధించడమే కాకుండా ఈ ఏజ్ లో కూడా తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘వెట్టయాన్’ సినిమా తొందర్లోనే రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ ని రీసెంట్ గా నిర్వహించారు. ఇక ఈ సినిమా లో అమితాబచ్చన్ కూడా నటిస్తున్నాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. కానీ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో రజనీకాంత్ తో పాటు కలిసి అమితాబచ్చన్ నటిస్తూ ఉండటం విశేషము… ఇక మొత్తానికైతే ఈ సినిమా ఒక భారీ సక్సెస్ ని సాధిస్తుందని రజనీకాంత్, అమితాబచ్చన్ భారీ నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఇక రీసెంట్ గా అమితాబచ్చన్ కల్కి సినిమాతో కూడా భారీ ప్రభంజనాన్ని సృష్టించిన విషయం మనకు తెలిసిందే…కల్కి సినిమాలో అశ్వద్ధామ క్యారెక్టర్ ని పోషించిన అమితాబచ్చన్ అశ్వద్ధమ ఇలాగే ఉంటాడా? అనేంతలా ప్రేక్షకులందరినీ మైమరింప చేశాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఈ ఈవెంట్లో రజనీకాంత్ అమితాబచ్చన్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు.

    నిజానికి రజనీకాంత్ అమితాబచ్చన్ చాలా సంవత్సరాల నుంచి మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే… ఇక అమితాబచ్చన్ కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులను రజనీకాంత్ చాలా స్పష్టంగా తెలియజేశాడు… గాంధీ ఫ్యామిలీతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ ఆయన ఎక్కడా కూడా తన ఇన్ఫ్లుయెన్స్ ని వాడకుండా సోలోగా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని మొత్తానికైతే స్టార్ హీరోగా నిలబడ్డాడు… ఇక కొన్ని సందర్భాల్లో తనకు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో జూహూ లో ఉన్న తన ఇంటిని కూడా అమ్మేసాడని ఆ తర్వాత మళ్లీ తను చాలా కష్టపడి ఇండస్ట్రీలో పైకి ఎదిగాడని చెప్పాడు.

    నిజానికి అలాంటి సిచువేషన్ లో వేరే ఎవరు ఉన్నా కూడా తమ వల్ల కాదని అన్ని వదిలేసి నిరుత్సాహపడుతూ కాలాన్ని గడిపేవారు. కానీ ఆయన ఓటమిని ఒప్పుకోలేదు కష్టపడి మరి గెలిచి చూపించాడు. అలాగే జుహు ఏరియాలో తను అమ్మేసిన ఇంటిని మళ్లీ పొందడంతో పాటుగా అదే ఏరియాలో అదనంగా మూడు ఇళ్లను కూడా కొన్నాడు.

    ఇక 82 సంవత్సరాల వయసులో కూడా సినిమా కోసం అనుక్షణం పరితపిస్తూ సక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? తన క్యారెక్టర్ తో సినిమాకి ఎలాంటి హంగులు తీసుకురాగాలను అంటూ ఆలోచిస్తూ ఉంటాడని రజనీకాంత్ అమితాబచ్చన్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…