Pawan Kalyan tweet : గత రెండు రోజుల నుండి తిరుమల తిరుపతి దేవస్థానం లో తయారు చేసే లడ్డులపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయటపెట్టిన కొన్ని సంచలన నిజాలు, నేషనల్ లెవెల్ లో ఏ స్థాయి ప్రకంపనలు రేపిందో మన అందరికీ తెలిసిందే. తిరుమల లడ్డులను తయారు చేయడం కోసం ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపింది. NDB రిపోర్టులో కూడా జంతువుల కొవ్వుని వినియోగించారని తేలడం తో మాజీ సీఎం జగన్ పై దేశవ్యాప్తంగా చాలా తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి అంటూ ఆయనపై చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సినీ సెలెబ్రిటీలు సైతం ఈ ఘటన పై విచారణ చేపట్టి, అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. కచ్చితంగా సిబిఐ విచారణ చేపట్టాలి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
దీనిపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ‘ఇలాంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే జాతీయ స్థాయిలో సనాతన ధర్మం పరిరక్షణ బోర్డు ని ఏర్పాటు చేయాలి’ అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలకు సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. ఇది ఇలా ఉండగా రేపు ఆయన 11 రోజులపాటు జరగబోయే ప్రాయశ్చిత్త దీక్ష ని ప్రారంభించబోతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ ఏడుకొండలవాడా కష్మించు..అమృతం తో సమానంగా, పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం లో గత పాలకుల వికృత చేష్టలు ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో కూడిన నెయ్యిని దేవుడి ప్రసాదం కోసం వినియోగించి, అపవిత్రం చేశారనే విషయం తెలుసుకొని నా హృదయం ముక్కలై అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కోరుకుంటూ పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను’ అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.
అయితే ఈ నెల 23 వ తారీఖు నుండి పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి డేట్స్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఆయన ఈ దీక్ష చేపడుతున్నాడు కాబట్టి మళ్ళీ షూటింగ్ వాయిదా పడే అవకాశం ఉందా అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అయ్యాయి. అయితే రామ్ చరణ్, చిరంజీవి మాల లోనే షూటింగ్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా అలాగే షూటింగ్ చేస్తాడని అంటున్నారు అభిమానులు. చూడాలి మరి.
ఏడుకొండలవాడా..! క్షమించు
•11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష
అమృతతుల్యంగా… పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం…— Pawan Kalyan (@PawanKalyan) September 21, 2024