Homeఎంటర్టైన్మెంట్Pattudala Movie : ఉత్కంఠరేపే యాక్షన్ థ్రిల్లర్ పట్టుదల ఓటీటీలో... డోంట్ మిస్, ఎక్కడ చూడొచ్చు?

Pattudala Movie : ఉత్కంఠరేపే యాక్షన్ థ్రిల్లర్ పట్టుదల ఓటీటీలో… డోంట్ మిస్, ఎక్కడ చూడొచ్చు?

Pattudala Movie :  కోలీవుడ్ స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. రజినీకాంత్, విజయ్ లకు సమానమైన స్టార్డం ఆయనకు అక్కడ ఉంది. అజిత్ హాలీవుడ్ తరహా యాక్షన్ ఎంటర్టైనర్స్ ఎంచుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఇదే జోనర్లో ఆయన సినిమాలు చేస్తున్నారు. అజిత్ కి తెలుగులో కొద్దో గొప్పో మార్కెట్ ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. లాభాలు ఖాయం. అందుకే అజిత్ నటించి ప్రతి చిత్రం తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు.

అజిత్ లేటెస్ట్ మూవీ విడాముయార్చి. ఈ చిత్రానికి మాగిజ్ తిరుమేని దర్శకుడు. తెలుగులో పట్టుదల టైటిల్ తో ఫిబ్రవరి 6న విడుదల చేశారు. పట్టుదల చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ మూవీ హాలీవుడ్ చిత్రం బ్రేక్ డౌన్ చిత్రానికి కాపీ అనే ఆరోపణలు మొదటి నుండి వినిపించాయి. మూవీ విడుదలయ్యాకే బ్రేక్ డౌన్ మూవీ స్ఫూర్తితో తెరకెక్కించారని స్పష్టమైంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన పట్టుదల కలెక్షన్స్ పరంగా పర్లేదు అనిపించుకుంది. తెలుగులో అయితే ఆదరణ దక్కలేదు. ఈ క్రమంలో పట్టుదల చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమ్ చేసేందుకు సిద్ధం చేశారు. త్రిష హీరోయిన్ గా నటించిన పట్టుదల చిత్రంలో అర్జున్, రెజీనా విలన్ రోల్స్ చేశారు. పట్టుదల డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మార్చి 3 నుండి స్ట్రీమ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. విడుదలైన నెల రోజుల లోపే పట్టుదల ఓటీటీలో అందుబాటులోకి రావడం విశేషం.

పట్టుదల మూవీ కథ విషయానికి వస్తే… 12 ఏళ్ళు కలిసి కాపురం చేసిన అజిత్, త్రిష కొన్ని కారణాలతో విడిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. దాంతో త్రిషను పేరెంట్స్ ఇంట్లో వదిలిపెట్టేందుకు అజిత్ కారులో బయలుదేరుతాడు. గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద గల సూపర్ మార్కెట్ లో అజిత్, త్రిషలకు అర్జున్, రెజీనా పరిచయం అవుతారు. వారిద్దరి పరిచయంతో అజిత్, త్రిషలకు అనుకోని సంఘటనలు, ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. త్రిష మిస్ అవుతుంది. త్రిషను కిడ్నాప్ చేసింది ఎవరు? అర్జున్, రెజీనా ఎవరు? సమస్యల నుండి అజిత్ ఎలా బయటపడ్డాడు? అనేది కథ..

RELATED ARTICLES

Most Popular