Flying car
Flying car : ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటే ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు పడుతున్నాం. ట్రాపిక్ జామ్ సమస్య మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద నగరాల్లోనూ ఉంది. దీనిని పరిష్కరించడానికి పలు రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయిన సందర్భంగా అబ్బా ఈ ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడితే బాగుండు. గాలిలో ఎగురిపోతే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఆ జామ్ బారిన పడే ప్రమాదం లేకుండా గాల్లో ఎగిరే కారు ఉంటే ఎలా ఉంటుంది.. ఆ ఊహ మనకు ఎంతో బాగుంది కదా.. ఒక అమెరికన్ ఆటో కంపెనీ ఇలాంటి వారి కలను నిజం చేసింది.
ఈ మధ్య నిత్యం రోడ్డు మీదకు వేలాది సంఖ్యలో కార్లు బైకులు వస్తున్నాయి. కార్లు, బైకుల కారణంగా విపరీతమైన ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. పెద్ద పెద్ద పట్టణాల్లో అయితే కొద్ది దూరం ప్రయాణించాలన్నా గంటలకు గంటల సమయం పడుతోంది. ఈ క్రమంలో గాల్లో నేరుగా ఎగిరి వెళ్లిపోతే బాగుండు అనే వాళ్ల కల నెరవేరనుంది. ఫ్లయింగ్ కారు అందుబాటులోకి వచ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాతో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..
అమెరికన్ ఆటోమోటివ్ అండ్ ఏవియేషన్ సంస్థ ‘అలెఫ్ ఏరోనాటిక్స్’ ఆకాశంలో ఎగురుతున్న కారుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇది హాలీవుడ్ సైన్స్-ఫిక్షన్ చిత్రంలా కనిపిస్తుంది. కాలిఫోర్నియా కార్ల తయారీ సంస్థ తన ఎలక్ట్రిక్ కారు రోడ్డు మీద ఉన్న మరో కారుపైకి దూకుతున్న వీడియోను విడుదల చేసింది. తాజాగా కాలిఫోర్నియాలోని రోడ్ల పై ఈ ఎగిరే కారును విజయవంతంగా టెస్టింగ్ నిర్వహించింది. ఈ కారు ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి తన ఎదురుగా ఉన్న మరో వాహనం పై నుంచి జంప్ చేసింది. ఈ ఇందుకు సంబంధించిన వీడియోను సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రాఫిక్ నుంచి తప్పించుకునే విధంగా ఈ కారును రూపొందించినట్లు పేర్కొంది.
ట్రాఫిక్ నుంచి తప్పించుకునేందుకు ఈ కారును ఇలా రూపొందించినట్లు పేర్కొంది. ఇది చరిత్రలో మొదటిసారి నగరంలో కారు నడుపుతూ నిలువుగా టేకాఫ్ తీసుకుంది. ఈ టెస్టింగ్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ప్రజలు ఇప్పటికే దీనిని కొనాలని ఆలోచిస్తున్నారు. ఇక ఈ కారు ధర 300,000 డాలర్లు కాగా 150 డాలర్లు డిపాజిట్ చేసి ఈ ఫ్లయింగ్ కారు బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మూడు వేల కార్లు ప్రీ బుక్ అయినట్లు చెప్పింది. 200 మైళ్లు ఎగిరే రేంజ్, 400 మైళ్లు డ్రైవింగ్ రేంజ్‌తో నలుగురు వ్యక్తులు ప్రయాణించవచ్చు. ఇక 2035 నాటికి ఈ కారు అందుబాటులోకి వస్తుందని కంపెనీ భావిస్తుంది.
ALEF’S FLYING CAR MOVES CLOSER TO REALITY WITH SUCCESSFUL TESTS
California-based startup Alef Aeronautics is pushing ahead with its Model A flying car, aiming for production by early 2026.
The vehicle, which can drive like a car and take off vertically, is undergoing flight… pic.twitter.com/laQQi7Y9xu
— Mario Nawfal (@MarioNawfal) February 22, 2025
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: The first flying car test is a success
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com