Abbas: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటుల కెరియర్ చాలా దారుణంగా ఉంటుంది. ఒక్క సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన స్టార్ హీరోలు సైతం అమాంతం టాప్ పొజిషన్ కి వెళ్ళినప్పటికి ఆ తర్వాత వాళ్ళు చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఏ చిన్న నిర్లక్ష్యం వహించిన కూడా వాళ్ళ కెరియర్ లో చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు రావచ్చు. ఇక ఇలాంటి క్రమంలోనే మొదట కొన్ని సినిమాలతో సూపర్ సక్సెస్ ని సాధించిన హీరోలు ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ సినిమాలను చేయడంతో వాళ్ల కెరీర్ అనేది లేకుండా పోయింది. మరి ఇలాంటి సందర్భంలో వాళ్లు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతుంటే మరి కొంత మంది మాత్రం సినిమాలు చేయలేక, అవకాశాలు రాక ఏదో ఒక జాబ్ చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు…ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పటి స్టార్ హీరో అయిన అబ్బాస్ తెలుగులో సినిమాలు అవకాశాలు లేకపోవడంతో న్యూజిలాండ్ వెళ్లి అక్కడ సాఫ్టువేర్ జాబ్ చేసుకుంటు తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక కెరియర్ మొదట్లో ‘ప్రేమదేశం’ లాంటి యూత్ ఫుల్ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో అంత పెద్ద సక్సెస్ లను సాధించలేకపోయాడు. దాంతో ఇండస్ట్రీ లో ఆయన కెరియర్ ఎక్కువ కాలం నిలువలేకపోయింది…
అయితే ఆయనకు అవకాశాలు లేని సమయంలో ఆయన హార్పిక్ యాడ్ ఫిలిం చేశాడు. దానివల్ల ఆయన దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాల పాటు తనకు సినిమా అవకాశాలు రాకపోయినా కేవలం ఆ ఆడ్ ఫిలిం నుంచి వచ్చే ఆదాయంతోనే ఆయన బతికినట్టుగా ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.
మొదట్లో ఆయన హార్పిక్ ఆడ్ ఫిలిమ్ చేసినప్పుడు కొంతమంది అతన్ని విమర్శించారని అయినప్పటికి ఆయన తనేమీ పట్టించుకోలేదని ఆ ఆడ్ ఫిలిం చాలా పాపులారిటిని సంపాదించుకుంది. ఇక దాంతో హార్పిక్ సేల్స్ కూడా ఎక్కువగా పెరగడంతో 8 సంవత్సరాల పాటు తనకి హార్పిక్ సంస్థ నుంచి ఎంతో కొంత డబ్బులు వచ్చేవట…
ఒక రకంగా చెప్పాలంటే దానివల్లే తన కుటుంబాన్ని చూసుకున్ననని, అలాగే ఆయన తన తదుపరి ప్లానింగ్స్ లో బిజీ కావడానికి దోహదం చేశాయని చెప్పాడు. ఆ యాడ్ ఫిలిం తనకి చాలా వరకు యూజ్ ఫుల్ అయిందని ఆయన చెబుతుండడం విశేషం…ప్రస్తుతం న్యూజిలాండ్ లో సెటిల్ అయిన అబ్బాస్ ఏదైనా మంచి క్యారెక్టర్ దొరికితే మాత్రం మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…