OG Premiere Shows: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓజీ'(They Call Him OG) ఈరోజు రాత్రి ప్రీమియర్ షోస్ నుండి ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ని చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం మెంటలెక్కిపోతున్నారు. భారీ బడ్జెట్ సినిమా కాదు, స్టార్ డైరెక్టర్ లేడు, కేవలం పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత ఒక ప్రామిసింగ్ మూవీ చేస్తున్నాడు, అందులో గ్యాంగ్ స్టర్ రోల్ వేస్తున్నాడు అనే ఈ చిత్రానికి ఈ రేంజ్ హైప్, క్రేజ్ క్రియేట్ అయ్యిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. దానికి తగ్గట్టుగా ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కూడా పేలడంతో క్రేజ్ రెట్టింపు అయ్యింది. రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.
ఇదంతా పక్కన పెడితే ఓవర్సీస్ కి కంటెంట్ డెలివరీ విషయం అక్కడి బయ్యర్స్ కి ఈ సినిమా పెట్టిన టార్చర్ మామూలుది కాదు. మేకర్స్ ముందుగా ఫస్ట్ హాఫ్ ని పంపించారు, సెకండ్ హాఫ్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. ఇంకెంత సమయం తీసుకుంటారు అని బయ్యర్స్ నేరుగా ట్విట్టర్ నుండి మేకర్స్ ని తిడుతూ ప్రెస్ నోట్స్ విడుదల చేసే రేంజ్ కి వచ్చారు. అంతటి ఒత్తిడికి గురైన తర్వాత ఎట్టకేలకు కంటెంట్ సమయానికి చేరుకుంది. దీంతో నార్త్ అమెరికా లో తీసివేయబడిన షోస్ మొత్తం తిరిగొచ్చాయి. అక్కడి ట్రేడ్ పండితులు చెప్తున్న మాట ఏమిటంటే, ఈ సినిమా కేవలం ప్రీమియర్ షోస్ తోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుందని, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో కి కూడా ఇలా మొదటి రోజు బ్రేక్ ఈవెన్ కొట్టిన రికార్డు లేదని, ఆ రకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్ టైం సెన్సేషన్ సృష్టించాడని అంటున్నారు.
అయితే కెనడా లో యోర్క్ సినిమాస్ ఈ చిత్రాన్ని కొన్ని కారణాల చేత తొలగించడం తో దాదాపుగా రెండు లక్షలకు పైగా గ్రాస్ మైనస్ అయ్యింది. యోర్క్ కి బదులుగా సింగల్ స్క్రీన్ థియేటర్స్ కి సంబంధించిన బుకింగ్స్ ని ప్రారంభించారు. ఇక్కడ టికెట్స్ బాగానే అమ్ముడుపోయాయి కానీ, యోర్క్ సినిమాస్ తో పోలిస్తే చాలా తక్కువ అనే చెప్పాలి. చూడాలి మరి ప్రీమియర్ ముగిసే సమయానికి ఎంత గ్రాస్ వసూళ్లను రాబడుతుంది అనేది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమాకు కల్కి చిత్రం తో సమానంగా ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ అమెరికా నుండి వచ్చింది. మరి ఫైనల్ ప్రీమియర్ షోస్ తో ఈ సినిమా కల్కి గ్రాస్ ని దాటుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం ప్రీ సేల్స్ ద్వారా ఓజీ చిత్రానికి 2.7 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చింది. టాక్ వస్తే 4 మిలియన్ డాలర్స్ రావొచ్చు.