https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ రిజెక్ట్ చేసిన కథతో భారీ హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్…

రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ప్రభాస్ తన కెరియర్ లో ఒక సినిమాని రిజెక్ట్ చేశాడు. అది ఏ సినిమా అంటే హీరిష్ శంకర్ డైరెక్షన్ లో...

Written By:
  • Gopi
  • , Updated On : March 6, 2024 / 10:02 AM IST

    Prabhas and Harish Shankar

    Follow us on

    Prabhas: ఒక హీరో కోసం రాసుకున్న కథలోకి మరొక హీరో రావడం, సినిమా చేయడం అనేది సర్వ సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఇక ఇలాంటి సమయంలోనే చాలామంది హీరోలు సక్సెస్ ఫుల్ సినిమాలను కోల్పోతూ వస్తుంటారు. అయితే కథని ముందువిన్న హీరోలు సరిగ్గా జడ్జ్ చేయలేకపోవడమే దానికి ముఖ్య కారణం అంటూ సినిమా విమర్శకులు సైత హీరోల మీద విమర్శలు చేస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే నిజంగా రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ప్రభాస్ తన కెరియర్ లో ఒక సినిమాని రిజెక్ట్ చేశాడు.

    అది ఏ సినిమా అంటే హీరిష్ శంకర్(Harish Shankar) డైరెక్షన్ లో రవితేజ(Ravi Teja) హీరోగా వచ్చిన మిరపకాయ్…ఈ సినిమాని మొదట హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కి చెప్పాడట. అయితే పవన్ కళ్యాణ్ అప్పుడు ఉన్న కొన్ని కమిట్ మెంట్ల వల్ల ఈ సినిమాని చేయలేకపోయాడు. దాంతో హరీష్ శంకర్ ప్రభాస్ కి ఈ కథ వినిపించాడట. అయినప్పటికీ ప్రభాస్ ఈ సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. ఇక దాంతో హరీష్ శంకర్ రవితేజని హీరోగా పెట్టి మిరపకాయ్ అనే సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. అయితే ఈ సినిమా ప్రభాస్ కి అయిన చాలా బాగుండేది. కానీ ప్రభాస్ మాత్రం ఈ సినిమాని చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు.

    దానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఈ సినిమా ప్రభాస్ కి పడితే మాత్రం భారీ బ్లాక్ బస్టర్ అయి ఉండేది… ఇక హరీష్ శంకర్ ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమా చేసి పవన్ కళ్యాణ్ కి ఒక బ్లాక్ బస్టర్ హిట్టించారనే చెప్పాలి. ఇక అప్పటినుంచి ఇప్పటి వరకు హరీష్ శంకర్ తనకంటూ ఒక మంచి పేరునైతే సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో హరీష్ శంకర్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు..