https://oktelugu.com/

NTR: ఎన్టీయార్ బాగా నమ్మిన డైరెక్టరే తనకి రెండు ప్లాప్ లు ఇచ్చాడు.. కారణం ఏంటంటే..?

ఎన్టీఆర్ కి మాత్రం అశోక్, ఊసరవెల్లి అనే రెండు ఫ్లాప్ సినిమాలను అందించాడు. నిజానికి వీళ్ల కాంబినేషన్ గురించి అప్పట్లో భారీ చర్చలు అయితే జరిగాయి. ఎందుకంటే వీళ్లిద్దరూ మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న డైరెక్టర్, హీరో అవ్వడం వల్ల ఆ సినిమాలపై మొదటి నుంచి మంచి అంచనాలైతే ఉన్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : March 6, 2024 / 10:02 AM IST

    NTR

    Follow us on

    NTR: ఇండస్ట్రీ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. చాలా రోజులు టైం తీసుకుని ఒక మంచి కథ రాసుకొని ఒక స్టార్ హీరోని పెట్టి సినిమా తీసిన కూడా అది సక్సెస్ కాకపోవచ్చు. అదే ఒక చిన్న స్టోరీ రాసుకొని ఒక కొత్త హీరోతో చేసిన సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ లు సాధించవచ్చు. అలా ఇండస్ట్రీలో ఏదైనా జరగొచ్చు…

    ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ రోజుల్లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఆది, సింహాద్రి సినిమాలతో తన స్టాండర్డ్ భారీ రేంజ్ లో పెంచుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ చేసిన సినిమాలు వరుస విజయాలను అందుకుంటూ ఆయన్ని స్టార్ హీరోల రేస్ లో ముందుకు తీసుకొచ్చాయి. అయితే ఎన్టీఆర్ కి ఒక డైరెక్టర్ మాత్రం వరుసగా రెండు ఫ్లాప్ లను ఇచ్చాడు. ఆ డైరెక్టర్ అంటే ఎన్టీయార్ కి చాలా ఇష్టం.అయినప్పటికీ ఆయన మాత్రం ఎన్టీఆర్ కి రెండు భారీ ప్లాప్ లను ఇచ్చాడు. ఆయన ఎవరు అంటే సురేందర్ రెడ్డి…ఆయన చాలామంది హీరోలకి మంచి విజయాలను అందించాడు.

    కానీ ఎన్టీఆర్ కి మాత్రం అశోక్, ఊసరవెల్లి అనే రెండు ఫ్లాప్ సినిమాలను అందించాడు. నిజానికి వీళ్ల కాంబినేషన్ గురించి అప్పట్లో భారీ చర్చలు అయితే జరిగాయి. ఎందుకంటే వీళ్లిద్దరూ మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న డైరెక్టర్, హీరో అవ్వడం వల్ల ఆ సినిమాలపై మొదటి నుంచి మంచి అంచనాలైతే ఉన్నాయి. కానీ అవి నెరవేర్చు కోలేకపోయారు. ఇక సురేందర్ రెడ్డి రవితేజకు కిక్, అల్లు అర్జున్ కి రేస్ గుర్రం, రామ్ చరణ్ కి ధృవ లాంటి సూపర్ సక్సెస్ లను అందించినప్పటికీ ఎన్టీఆర్ కి మాత్రం ప్లాప్ లు ఇవ్వటం పట్ల ఆయన అభిమానులు తీవ్రమైన నిరాశకి గురవుతూ ఉంటారు.

    ఇక ఎన్టీఆర్ ఫ్లాప్ లా ప్రస్తావన వచ్చిన ప్రతిసారి అశోక్, ఊసరవెల్లి సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రెండు సినిమాలు పక్కా హిట్ అవుతాయని అనుకున్నప్పటికీ, అవి పెద్దగా ఆడక పోవడంతో మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచిందంటూ ఎన్టీఆర్ డై హార్ట్ ఫ్యాన్స్ కొంతమంది సోషల్ మీడియా వేదికగా వాళ్ల భాదలను పంచుకుంటూ ఉంటూ ఉంటారు…