Lokesh Kanakaraj : తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న దర్శకుడు రాజమౌళి… ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోకి తెలుగు సినిమా ఇండస్ట్రీని పరిచయం చేయాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను పెట్టి ఆయన తీసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది దిగ్గజ దర్శకులను సైతం ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి బ్యాలెన్స్డ్ గా సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది నిజంగా ఒక రాజమౌళికి మాత్రమే సాధ్యమవుతుంది. మిగతా ఏ దర్శకులు చేసినా కూడా అంతా మంచి అవుట్ పుట్ అయితే వచ్చేది కాదని ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు చెబుతున్నారు. నిజానికైతే రాజమౌళి మార్కు పడిందంటే చాలు ఆ సినిమాకి ఎక్కడికో వెళ్లిపోతుందని చెప్పడానికి ఆయన చేసిన సినిమాలను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ప్రతి హీరో చేస్తున్న సినిమాలు ఒకెత్తయితే రాజమౌళితో ఒక్క సినిమా చేసిన కూడా ఆ హీరోకి మార్కెట్లో ఉండే డిమాండ్ వేరే రేంజ్ లో ఉంటుంది. అందువల్లే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క నటుడు రాజమౌళి సినిమాలో చిన్న క్యారెక్టర్ అయిన సరే చేయడానికి సిద్ధంగా ఉంటారు.
ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో ఎన్టీఆర్ ఇప్పుడు వరుసగా మల్టీ స్టారర్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరోసారి తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఒక మల్టీస్టారర్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తమిళ్ స్టార్ హీరోయిన సూర్య, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే సూర్యతో ఒక సినిమా చేయాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్న లోకేష్ కనకరాజ్ ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని కూడా భాగం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం ఆయన ‘ కూలీ ‘ సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా అయిపోయిన తర్వాత ఈ భారీ మల్టీ స్టారర్ సినిమా అనౌన్స్ మెంట్ అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది… మరి దీని ద్వారా జూనియర్ ఎన్టీఆర్ మరింత మార్కెట్ ను పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి…