Mahesh Babu and NTR: సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నటుడు మహేష్ బాబు… రాజకుమారుడు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో ప్రపంచస్థాయి ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్నాడు… ఇక నందమూరి ఫ్యామిలీ మూడో తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం కెరియర్ స్టార్టింగ్ లోనే మాస్ సినిమాలను చేసి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన డిఫరెంట్ వే లో తనను తాను ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘డ్రాగన్’ అనే సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరిలో గొప్ప నటుడు ఎవరు అంటూ ఇద్దరు హీరోలతో సినిమాలను చేసిన ఒక డైరెక్టర్ ని అడగగా ఆయన ఆశ్చర్యపోయే సమాధానం అయితే చెప్పాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే కృష్ణవంశీ కావడం విశేషం…
కెరియర్ మొదట్లో మహేష్ బాబు కృష్ణవంశీతో మురారి అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. మహేష్ బాబు కెరీర్ లో కూడా ఇదొక మూవీగా నడిచిపోయిందనే చెప్పాలి. ఇక అలాగే ఎన్టీఆర్ తో రాఖీ అనే సినిమా చేశాడు. రాఖీ సినిమా సైతం ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన రాబట్టింది.
కమర్షియల్ గా ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికి నటనపరంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ మాత్రం మరొక మెట్టు పైకి ఎక్కాడనే చెప్పాలి. అయితే వీళ్ళిద్దరిలో గొప్ప నటుడు ఎవరని కృష్ణవంశీని అడగగా ఆయన దానికి ఇద్దరు మంచి నటులే అంటూ సమాధానం ఇచ్చాడు.
దానికి వివరణ ఇస్తూ మహేష్ బాబు సెటిల్డ్ ఆర్టిస్ట్ అని ఎలాంటి ఎమోషన్ అయిన సరే చాలా పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయగలడని, జూనియర్ ఎన్టీఆర్ అయితే ఒక క్యారెక్టర్ ని చాలా వైల్డ్ గా ప్రజెంట్ చేస్తాడు. అలాగే ప్రేక్షకుడి లోపలికి ఇంజక్ట్ చేయగలిగే కెపాసిటి తనకు ఉందని చెప్పాడు. ఓవరాల్ గా ఇద్దరూ మంచి నటులే తెలుగు సినిమా ఇండస్ట్రీకి వీళ్లిద్దరు దొరకడం నిజంగా అదృష్టం అంటూ ఆయన చెప్పడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది…
