https://oktelugu.com/

Surya: స్టార్ కమెడియన్ దర్శకత్వంలో హీరో సూర్య..ఊహించని కాంబినేషన్ ని చూసి భయపడుతున్న ఫ్యాన్స్!

గత మూడేళ్ళ నుండి ఆయన శివ దర్శకత్వం లో 'కంగువ' అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని చేస్తున్నాడు. దీపావళి సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా, కోలీవుడ్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 15, 2024 / 02:39 PM IST

    Surya

    Follow us on

    Surya: తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ బాషలలో మన సౌత్ ఇండియా నుండి సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఒకప్పుడు మంచి మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సూర్య మాత్రమే. ఒకానొక దశలో రజినీకాంత్ ని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డామినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సూర్య చాలా కాలం నుండి సక్సెస్ లేక మార్కెట్ మీద పూర్తిగా పట్టు కోల్పోయాడు. తమిళనాట మీడియం రేంజ్ హీరోలు కూడా బాక్స్ ఆఫీస్ వసూళ్ల విషయం లో సూర్య ని దాటిపోయారు. దీంతో ఆయన అభిమానులు ఒక సరైన సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. 2022 వ సంవత్సరం లో సూర్య నుండి ‘ఈటీ’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయన నుండి మరో చిత్రం రాలేదు.

    గత మూడేళ్ళ నుండి ఆయన శివ దర్శకత్వం లో ‘కంగువ’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని చేస్తున్నాడు. దీపావళి సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా, కోలీవుడ్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తో పాటు ఆయన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో మరో సినిమా కూడా సమాంతరంగా షూటింగ్ ని ప్రారంభించి పూర్తి చేసాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన మరో సినిమాకి పచ్చ జెండా ఊపాడు. ప్రముఖ హాస్య నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం లో సూర్య 45వ చిత్రం తెరకెక్కబోతుందని కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసారు. ఆర్జే బాలాజీ సినిమాలోకి రాకముందు రేడియో జాకీగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. అలా వచ్చిన ఫేమ్ తో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన కేవలం కమెడియన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే కాదు గాయకుడిగా, దర్శకుడిగా కూడా రాణించాడు.

    నయనతార ప్రధాన పాత్ర పోషించిన ‘అమ్మోరు తల్లి’ చిత్రానికి దర్శకత్వం వహించింది ఈయనే. కమర్షియల్ గా ఈ సినిమా తమిళం లో పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత సత్యరాజ్ తో ‘వీట్ల విశేషం’ అనే సినిమా తీసాడు. దీనికి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మూడవ సినిమా ఏకంగా సూర్య లాంటి స్టార్ తో చేసే అవకాశం దక్కింది. డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఇది వరకు ఆర్జే బాలాజీ ఎలాంటి స్టార్ హీరో సినిమాకి దర్శకత్వం వహించలేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా సూర్య తో సినిమా అంటే, ఆయన సరిగా హ్యాండిల్ చేయగలడా? అని సూర్య అభిమానులు కాస్త భయపడుతున్నారు. నవంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల కాబోతుంది.