Devara: ‘దేవర’ కలెక్షన్స్ ఇక క్లోసింగ్ కి వచ్చినట్టే..ఓవరాల్ గా ప్రభాస్ ఫ్లాప్ సినిమాలను కూడా దాటలేకపోయిందిగా!

దసరా కానుకగా విడుదలైన కొన్ని కొత్త సినిమాలను సైతం ఈ చిత్రం డామినేట్ చేసి సంచలనం సృష్టించింది. అలాంటి బ్లాక్ బస్టర్ రన్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు దాదాపుగా క్లోసింగ్ కి వచ్చేసినట్టుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

Written By: Vicky, Updated On : October 15, 2024 2:37 pm

Devara Collection(3)

Follow us on

Devara: ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘దేవర’ చిత్రం, బాక్స్ ఆఫీస్ వద్ద పాన్ ఇండియా లెవెల్ లో ఏ స్థాయి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అనేక ప్రాంతాలలో ఈ చిత్రం రాజమౌళి సినిమాల రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. ఉదాహరణకి #RRR చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్ స్టాప్ గా 17 రోజులు కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘దేవర’ చిత్రానికి ఏకంగా 18 రోజులు నాన్ స్టాప్ గా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది ఆల్ టైం సెన్సేషనల్ రికార్డు గా చెప్పుకోవచ్చు. అలాగే ఇటీవల కాలం లో విడుదలైన పెద్ద హీరోల సినిమాలలో మొదటి వారం కంటే రెండవ వారం అత్యధిక ఆక్యుపెన్సీలను నమోదు చేసుకోవడం వంటివి కూడా ఈ సినిమాకే ఈమధ్య కాలం లో మనం చూసాము.

అలాగే దసరా కానుకగా విడుదలైన కొన్ని కొత్త సినిమాలను సైతం ఈ చిత్రం డామినేట్ చేసి సంచలనం సృష్టించింది. అలాంటి బ్లాక్ బస్టర్ రన్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు దాదాపుగా క్లోసింగ్ కి వచ్చేసినట్టుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు. దసరా సెలవలు ముగిసిపోయాయి, నిన్న కొన్ని ప్రాంతాలలో సెలవలు ఉండండం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలలో మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. ఫలితంగా కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చింది. కేవలం నైజాం ప్రాంతం నుండే 38 లక్షల రూపాయిలు షేర్ వసూళ్లు నిన్న ఒక్క రోజే వచ్చాయట. అయితే నేటి నుండి అనేక ప్రాంతాలలో ఈ సినిమా నెట్ ఫ్రీ మీద రన్ అవుతుందని సమాచారం. అంటే థియేటర్స్ నుండి రెంటల్ బేసిస్ మీద కాకుండా, కమీషన్ బేసిస్ మీద నడుపుతారు అన్నమాట. ఇక రోజువారీ షేర్ వసూళ్లు 50 లక్షల రూపాయిల కంటే తక్కువగా ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఫుల్ రన్ కి మరో 2 నుండి 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు అదనంగా వచ్చే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ విషయం లో మూడు భిన్నమైన సమాచారాలు అందుతున్నాయి.

కొంతమంది ఈ సినిమాకి కేవలం 385 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయని అంటున్నారు, మరికొంతమంది అయితే 420 కోట్ల రూపాయిలు వచ్చినట్టు చెప్తున్నారు. ఇక నిర్మాతలు అయితే ఏకంగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణ హక్కులను కొనుగోలు చేసిన నాగ వంశీ, వచ్చిన వసూళ్లు ఇవే, నమ్మితే నమ్మండి, లేకపోతే పోండి అనడం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా పక్కన పెడితే దేవర చిత్రం ప్రభాస్ నటించిన ఫ్లాప్ చిత్రాలు ‘ఆదిపురుష్’, ‘సాహూ’ వసూళ్లను దాటలేకపోయిందని సోషల్ మీడియా లో ప్రభాస్ అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. ‘సాహూ’ చిత్రానికి 432 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ‘ఆదిపురుష్’ చిత్రానికి 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.