Star Actress: తొలివలపు సినిమాలో హీరో అన్నయ్యగా కూడా నవీన్ ఓలేటి నటించాడు. అయితే చాలామందికి ఆయన భార్య కూడా ఒక స్టార్ నటి అనే విషయం తెలియదు. ప్రస్తుతం ఫోటోలో కనిపిస్తున్న నటుడు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ తో పాటు వెండి తెర మీద కూడా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. నవీన్ ఓలేటి తెలుగులో 100కు పైగా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వివిధ పాత్రలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. చాలా సినిమాలలో ఇతనిని చూసి ఉంటారు కానీ ఇతని పేరు ఎవరికీ తెలిసి ఉండదు. ఎందుకంటే ఈ నా పేరు అంత పాపులర్ పేరు కాదు. కానీ ప్రేమంటే ఇదేరా సినిమాలో హీరో వెంకటేష్ ఫ్రెండ్ గా నటించిన నటుడు అంటే మాత్రం చాలామంది వెంటనే గుర్తుపట్టేస్తారు. అలాగే తొలివలపు సినిమాలో హీరో సోదరిదిగా కూడా నటించే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే తెలుగులో నువ్వే నువ్వే, ప్రేమించుకుందాం రా, విక్రమార్కుడు వంటి సినిమాలలో మంచి పాత్రలలో కనిపించి మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు.
Also Read: తెలుగులో ఇప్పటివరకు 17 సినిమాలు చేసింది.. కానీ స్టార్డం మాత్రం రాలేదు.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా..
ముఖ్యమైన సినిమాలలో కంటే బుల్లితెర మీద చాలా ఫేమస్. బుల్లితెర మీద ప్రసారమయ్యే పద్మవ్యూహం, నాన్న వంటి పలు సీరియల్లలో నటించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితం. ఆ తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి నవీన్ పలు సపోర్టింగ్ పాత్రలలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హీరోలకు స్నేహితుడిగా ఎక్కువ సినిమాలలో నటించాడు. అయితే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే అతని భార్య కూడా టాలీవుడ్ స్టార్ నటి. నవీన్ ఓలేటి భార్య పేరు మధురిమ. ఈమె కూడా బుల్లితెర మీద మరియు వెండి తెర మీద చాలా పాత్రలలో నటించింది. మధురిమ ఆర్.నారాయణమూర్తి దర్శకత్వం వహించిన దళం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.
తెలుగులో ఈమె తొలివలపు, ప్రేమంటే ఇదేరా, ప్రేమతో రా, ఫ్యామిలీ సర్కస్, విక్రమార్కుడు, నరసింహ నాయుడు అంటే పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. విక్రమార్కుడు సినిమాతో మధురిమకు మంచి గుర్తింపు ఉంది. ఈ సినిమాలో ఆమె రాజీవ్ కనకాల భార్యగా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమాలో నవీన్ ఓలేటి కూడా పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించాడు. ప్రస్తుతం వీరిద్దరూ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ యూఎస్ఏ లో జీవితం గడుపుతున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నవీన్ ఓలేటి, మధురిమ ఫ్యామిలీ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో అందరిని ఆకట్టుకుంటున్నాయి.
Also Read: ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లు మొత్తం ఫేక్ అంటూ నోరు జారేసిన పూజా హెగ్డే !