Nazriya and Fahadh Faasil : సినీ సెలబ్రిటీలు ఈమధ్య కాలం లో ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటున్నారో, అంతే తొందరగా విడిపోతున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే గొడవలకు కూడా ఈమధ్య సెలబ్రిటీలు విడాకులు వరకు వెళ్లిపోతున్నారు. అలా ఎంతో మంది టాప్ సెలబ్రిటీలు ఈమధ్య కాలంలో విడిపోయారు. ముఖ్యంగా సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏళ్ళ తరబడి డేటింగ్ చేస్తూ, ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఎందుకు ఇలా విడిపోతున్నారు అనే దానిపై ఎవరి దగ్గరా సరైన సమాధానం లేదు. ఇకపోతే ఎంతో అన్యోన్య దాంపత్య జీవితం గడుపుతున్న ప్రముఖ హీరోయిన్ నజ్రియా నజీమ్(Nazriya Nazim), ఫహాద్ ఫాజిల్(Fahad Fazil) జంట కూడా విడిపోబోతుంది అంటూ సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా నజ్రియా పెట్టిన ఒక ఇంస్టాగ్రామ్ స్టోరీ కూడా వీళ్ళు విడిపోబోతున్నారు అనే రూమర్స్ కి మరింత బలం చేకూరేలా చేసింది.
Also Read : ఈ క్యూట్ బేబీ ఇప్పుడు ఫేమస్ హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా?
పూర్తి వివరాల్లోకి సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే హీరోయిన్స్ లో ఒకరు నజ్రియా నజీమ్. అయితే ఈమధ్య కాలం లో ఆమె యాక్టీవ్ గా ఉండడం మానేసింది. సూక్ష్మ దర్శిని అనే చిత్రం లో హీరోయిన్ గా నటించిన నజ్రియా, ఆ సినిమా ప్రొమోషన్స్ సమయం లో ఇన్ స్టాగ్రామ్ లో యాక్టీవ్ గా ఉండేది. కానీ ఆ తర్వాత మాయం అయిపోయింది. తాను ఎందుకు ఈమధ్య యాక్టీవ్ గా ఉండలేదో చెప్పుకొస్తూ ఒక లేఖను విడుదల చేసింది. అందులో ఏముందంటే ‘అభిమానులంతా బాగున్నారని ఆశిస్తున్నాను. ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే నేను, ఈమధ్య కాలం లో యాక్టీవ్ ఎందుకు లేనో చెప్పడానికి నాకు కాస్త సమయం కావాలని కోరుకుంటున్నాను. గత కొంతకాలం గా నేను వ్యక్తిగత సవాళ్లతో ఇబ్బంది పడుతున్నాను’
‘నా మనసు ప్రశాంతంగా లేదు. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలను మిస్ అయ్యాను. ‘సూక్ష్మ దర్శిని’ విజయాన్ని ఆస్వాదించలేదు, నా 30వ పుట్టిన రోజు కూడా జరుపుకోలేదు. ఎందుకు ఇలా అయిపోయావు అని నా స్నేహితులు, సన్నిహితులు ఫోన్ కాల్స్ , మెసేజిలు చేశారు. కానీ వాళ్లకు నేను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అందుకు నన్ను క్షమించండి. కొత్త సినిమాల కోసం నాకు ఎంతో మంది దర్శక నిర్మాతలు కూడా కాల్ చేశారు. వాళ్లకు కూడా నేను సమాధానం ఇవ్వలేదు. ఇది నాకు చాలా కఠినమైన ప్రయాణం. ప్రతీ రోజు కోలుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాను, కానీ నా వల్ల అవ్వడం లేదు. పూర్తిగా కోలుకొని మళ్ళీ ఎప్పటిలా మీ ముందుకు రావడానికి నాకు కాస్త సమయం పట్టొచ్చు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇంత డిప్రెషన్ లోకి వెళ్లిందంటే కచ్చితంగా ఫహాద్ తో విడాకుల వ్యవహారమే అయ్యుంటుంది అని అంటున్నారు నెటిజెన్స్.
Also Read : ఆమె విషయంలో వింతగా ప్రవర్తిస్తున్న ‘నాని’