Salaar 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆయన చేసిన ఈశ్వర్ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమా వరకు ఆయన ప్రభంజనం అనేది ఇక్కడ తారాస్థాయిలో కొనసాగిందనే చెప్పాలి. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టిన ఆయన అక్కడ కూడా తన నట విశ్వరూపాన్ని చూపిస్తూ ఆయనను మించిన హీరో మరొకరు లేరు అనేంతలో మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంటున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఆయన చేసిన సలార్ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమాకి సీక్వెల్ గా సలార్ 2 సినిమా కూడా రాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక అలాగే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది అనే విషయాల్లో క్లారిటీ లేక ప్రభాస్ అభిమానులు విపరీతమైన లో కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇక ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే ఈ సినిమా ఇప్పుడప్పుడే పట్టాల మీదకి ఎక్కే అవకాశాలైతే లేవు. కానీ సలార్ 2 సినిమా ఎప్పుడు పట్టాలెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా మరొక వ్యక్తి కూడా కీలకపాత్ర వహించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఆయన ఎవరు అంటే బాబీ సింహ… సలార్ 2 సినిమాలో శౌర్యంగుల గురించి ఉండబోతుంది అని సినిమా ఎండింగ్ లో చెప్పడం తో బాబీ సింహా అప్పుడు శౌర్యంగుల గురించి పోరాటం చేసే వ్యక్తి గా కనిపించాడు. కాబట్టి ప్రభాస్ తో పాటు బాబీ సింహ కూడా సాలార్ 2 లో కీలక పాత్ర వహించబోతున్నాడట. కాబట్టి పృధ్విరాజ్ సుకుమారన్ తో ప్రభాస్ ఫైట్ చేయడానికి బాబీ సింహ కీలకంగా మరో మారుబోతున్నారట.
అలాగే ప్రభాస్ ని వాళ్ల వంశం మొత్తాన్ని కాపాడుకుంటూ రావడంలో ఆయన కీలకపాత్ర వహించాడు అనే విషయాన్ని ఈ సినిమాలో ఫుల్ గా రివిల్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రభాస్ తర్వాత ఈ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో కీలకంగా మారబోతున్నట్టుగా మేకర్స్ అయితే ఇప్పటికే హింట్ ఇచ్చారు…