SSMB29 Prithviraj Sukumaran First Look: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ తమిళనాడులోని మద్రాస్ లో తమిళ సినిమా ఇండస్ట్రీ లో భాగమై ఉండేది… అప్పుడు మనకు సెపరేట్ అయిడెంటిటి ఉండేది కాదు. దాంతో విసిగిపోయిన నాగేశ్వర్ రావు ఎలాగైనా సరే మన ఇండస్ట్రీ ని మనం నిర్మించుకోవాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. అది సాధ్యంకాదని చాప మంది చెప్పిన పట్టించుకోలేదు. ఎంతమంది విమర్శించిన పెడచెవినపెట్టాడు. మొత్తానికైతే ఇండస్ట్రీ ని హైదరాబాద్ కి తీసుకువచ్చాడు… అప్పటి నుంచి తమిళుల కంటే మన సినిమాలు బాగుంటాయి. మన కథలకు ఎక్కువ ఆదరణ దక్కుతోంది అని మనవాళ్ళు ప్రూవ్ చేయాలనే ప్రయత్నం చేశారు… కానీ ఎక్కువసార్లు వాళ్ళే మనల్ని డామినేట్ చేస్తూ వచ్చారు…ఇక మొత్తానికి రాజమౌళి లాంటి దర్శకుడు వచ్చి తెలుగు సినిమా స్థాయిని పెంచాడు… సౌత్ లో అప్పటి వరకు మేమే అగ్రస్థానం లో ఉన్నాం అని విర్రవీగిన తమిళులతో పాటు, ఇండియాలో మాకు పోటీ లేదని చెప్పుకు తిరిగే బాలీవుడ్ ఇండస్ట్రీ ని సైతం పక్కకి నెట్టేసాడు… అలాంటి రాజమౌళి మీద ఇండియా లో ప్రతి ప్రేక్షకుడికి గొప్ప గౌరవమైతే ఏర్పడింది. ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబు తో చేస్తున్న సినిమాతో మన ఇండస్ట్రీ ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లానే ప్రయత్నం చేస్తున్నాడు… కాబట్టి ఈ సినిమా మీద ఇప్పుడు ఎక్కువ కేర్ తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈనెల 15 వ తేదీన రామోజీ ఫిలిం సిటీలో రాజమౌళి నిర్వహిస్తున్న ఈవెంట్ లో ఈ మూవీ కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు…అప్పటిదాకా ఆగలేక ఈరోజు కూడా ఒక అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో నటిస్తున్న పృథ్వీ రాజ్ సుకుమారన్ క్యారెక్టర్ ను తెలియజేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈ మూవీ లో పృథ్వీ రాజ్ ‘కుంభ’ అనే పాత్రలో నటిస్తున్నాడు అంటూ ఆయన లుక్ ను రివీల్ చేశాడు… ఆ పోస్టర్ లో అంగవైకల్యంతో ఉన్నా ఆయన వీల్ చైర్ కి పరిమితమైనట్టుగా తెలుస్తోంది. ఇక దాని మీద చాలా విమర్శలైతే వస్తున్నాయి… క్రిష్ 3, సూర్య హీరోగా వచ్చిన 24 మూవీ నుంచి ఆ లుక్ కాపీ చేశారు అంటూ కామెంట్స్ అయితే వస్తున్నాయి…
Also Read: ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ‘బిగ్ బాస్ 9’ లో టాప్ కంటెస్టెంట్..ఎవరో గుర్తుపట్టగలరా?
‘జో స్వాన్సన్’ చేసిన ‘Family Guy’ అనే ఒక యానిమేటెడ్ టీవీ సిరీస్ లో ఆయన వీల్ చైర్ లో కూర్చొని ఉన్న పిక్ ను వైరల్ చేస్తూ పృథ్వీ లుక్ సేమ్ ఇలాగే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి ఈ టీవీ సిరీస్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ ను కాపీ చేశాడు అంటూ కొన్ని కామెంట్లైతే వ్యక్తమవుతున్నాయి…ఈ యానిమేటెడ్ టీవీ సిరీస్ లో జో స్వాన్సన్ ‘ క్రిప్లేట్రాన్ రోబోట్ సూట్’ వేసుకొని కనిపిస్తాడు…
ఇక ఈ సిరీస్ లో ఆయన వెన్నెముక గాయంతో వీల్ చైర్ కి పరిమితమైన ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు…సీజన్ 8, ఎపిసోడ్ 14 లో జో స్వాన్సన్ క్రిప్లేట్రాన్ స్పైడర్ రోబోట్ సూట్ తో కనిపిస్తాడు… మొత్తానికైతే జో స్వాన్సన్ ఈ సిరీస్ లో ఆయనకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళను ఈ సూట్ ద్వారా ఎలా అంతమందించాడు అనేది ఈ సిరీస్ లో చూపించారు…
ఇక అప్పుడెప్పుడో వచ్చిన ఈ సిరీస్ ను సైతం రాజమౌళి వదలకుండా కాపీ చేస్తున్నాడు అంటూ ఆయన విమర్శిస్తున్నారు. ఇక ఇదంతా చూస్తుంటే తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన రాజమౌళి ప్రతిసారి ఎందుకని ఇలా కాపీ ఆరోపణలను ఎదుర్కుంటున్నారు. ఆయన మీద ఇప్పుడు దేశం మొత్తం ఆరోపణలు చేస్తుండటం తన అభిమానులకు నచ్చడం లేదు…ఇక దీని మీద రాజమౌళి స్పందిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…