SSMB 29 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి (Rajamouli)…ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటాయి. ఇక అంచనాలకు తగ్గట్టుగానే వాళ్ళు ఆ సినిమాను చూసి సక్సెస్ చేసి ఆయనను టాప్ లెవెల్ కి తీసుకెళ్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ లెవెల్లో ఒక సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసిన రాజమౌళి (Rajamouli) రెండో షెడ్యూల్ మీద భారీ కసరత్తులైతే చేస్తున్నాడు. మొత్తానికైతే మహేష్ బాబును ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు డూప్ లేకుండా కొన్ని సాహసోపేతమైన సన్నివేశాల్లో పాల్గొని తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు. నిజానికి మహేష్ బాబు ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో రియల్ స్టంట్స్ అయితే చేశాడు. ఇక దానికి ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాలో కూడా అలాంటి సన్నివేశాల్లో పాల్గొని తనకు తానే పోటీ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
Also Read : SSMB 29 లీక్… రాజమౌళి కావాలనే చేశాడా? తెరపైకి విస్తుగొలిపే విషయాలు!
ఇక ఈ సినిమాలో చాలామంది స్టార్ కాస్టింగ్ ఉన్నప్పటికి రాజమౌళి ఎలాంటి న్యూస్ కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పటివరకు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృధ్విరాజ్ సుకుమారన్ ఈ ముగ్గురి పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. మరి మిగతా ఆర్టిస్టులను కూడా ఫైనల్ చేసి వాళ్ళతో షూట్ చేస్తున్నప్పటికి వాళ్ళు ఎవరు అనేది చెప్పడం లేదు.
మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ నుంచి ఒక సినిమా పాన్ వరల్డ్ లెవెల్లో వస్తుంది అని తెలుసుకున్న చాలామంది అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఇక ఈ దెబ్బతో తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడమే కాకుండా వరల్డ్ సినిమా స్థాయిలో మన తెలుగు సినిమాలను నిలపాలని వాళ్ళతో పాటు సమానమైన గుర్తింపును మన హీరోలు అందుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు…