Homeఎంటర్టైన్మెంట్Rajamouli: SSMB 29 లీక్... రాజమౌళి కావాలనే చేశాడా? తెరపైకి విస్తుగొలిపే విషయాలు!

Rajamouli: SSMB 29 లీక్… రాజమౌళి కావాలనే చేశాడా? తెరపైకి విస్తుగొలిపే విషయాలు!

Rajamouli: రాజమౌళి షూటింగ్ సెట్స్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. సినిమాకు సంబంధించిన ఎలాంటి సమాచారం, ఫోటోలు, వీడియో బయటకు రాకుండా భద్రతా ప్రమాణాలు పాటిస్తాడు. సెట్స్ లో ఎవరూ మొబైల్ వాడకూడదు. బయట సబ్మిట్ చేసి రావాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అవుట్ డోర్ షూటింగ్ లో సమస్యలు తప్పవు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉండగా ఫోటోలు బయటకు వచ్చాయి.

Also Read: చిక్కుల్లో రాజా సాబ్… ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్!

ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి చేస్తున్న SSMB 29 విషయంలో ఆయన మరింత స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. అసలు పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు కూడా విడుదల చేయలేదు. లాంచింగ్ సెరిమోనీకి మీడియాను అనుమతించలేదు. హైదరాబాద్ నగర శివారులో గల అలిమినీయం ఫ్యాక్టరీలో గుట్టుగా కార్యక్రమం పూర్తి చేశారు. అక్కడే వేసిన సెట్ లో కొంత షూటింగ్ జరిపారని సమాచారం. SSMB 29 లేటెస్ట్ షెడ్యూల్ ఒరిస్సాలో గల ఫారెస్ట్ ఏరియాలో జరుగుతుంది. లాంగ్ షెడ్యూల్ అని సమాచారం.

హీరో మహేష్ తో పాటు ప్రధాన విలన్ రోల్ చేస్తున్న పృథ్విరాజ్ సుకుమారన్ ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. కాగా SSMB 29 షూటింగ్ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఓ కీలక సన్నివేశం లీకైంది. విలన్ ఎదురుగా వీల్ చైర్ లో కూర్చుని ఉన్నాడు. మహేష్ బాబును అతని అనుచరులు తోయడం, విలన్ ముందు ఆయన మోకాళ్ళ మీద కూర్చోవడం ఆ లీకైన వీడియోలో ఉంది. మహేష్ లుక్ తో పాటు సినిమాలోని కీలక సన్నివేశం లీక్ కావడం సంచలనంగా మారింది.

అయితే ఇదంతా రాజమౌళి స్కెచ్. కావాలనే ఆయన వీడియో లీక్ చేశాడు. సినిమాపై బజ్ క్రియేట్ చేయడం కోసం ఈ ప్లాన్ చేశాడని అంటున్నారు. ఆ వీడియో పరిశీలిస్తే నిజమే అనిపిస్తుంది. షూటింగ్ కి సమీపంలో ఉన్న యూనిట్ కి సంబంధించిన వెహికల్ నుండి ఆ వీడియో తీశారు. వాహనం అద్దాన్ని మనం గమనించవచ్చు. రాజమౌళి కావాలని వీడియో లీక్ చేశాడన్న ఆరోపణలను పలువురు ఖండిస్తున్నారు. ఆయన సినిమాకు ఆటోమేటిక్ గా హైప్ ఉంటుంది. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు.

రాజమౌళి సీరియస్ అయ్యాడని, ఫుటేజ్ తొలగించేలా చర్యలు చేపట్టాడని మరో వార్త హల్చల్ చేస్తుంది. ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్, దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Exit mobile version