PM Modi: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పీఎం మోదీ నివాళి అర్పించారు. ఆయన తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడు.. దార్శినికత ఉన్న నాయకుడు అని కొనియాడారు. సినిమాల్లో ఎన్నటీఆర్ పోషించిన పాత్రలను ఇప్పటికీ ప్రజలు తలచుకుంటూనే ఉంటున్నారని చెప్పారు. సమాజ సేవ, పేదలు అణగారిన వర్గాల సాధికారతకు కృషి చేశారన్నారు. ఆయన నుంచి ఎంతో ప్రేరణ పొందినట్లు తెలిపారు. ఏపీ కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ ఆశయాలను సాధించేందుకు కృషి చేస్తోందని తెలిపారు.