https://oktelugu.com/

SS Thaman : దసర సినిమాలో ఆ సాంగ్ సెట్ అవ్వలేదు అంటూ కామెంట్స్ చేసిన తమన్…

SS Thaman : ఇప్పటివరకు చాలామంది హీరోలు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. నాని లాంటి హీరో మాత్రం ఒక్కో సినిమాతో సూపర్ హిట్స్ అందుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ స్టార్ హీరోగా మారడమే తన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది...

Written By: , Updated On : March 23, 2025 / 02:00 PM IST
SS Thaman

SS Thaman

Follow us on

SS Thaman : న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసర సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇక నానికి మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చి పెట్టడమే కాకుండా ఆయనలో నటన ప్రతిభను మరోసారి బయటికి తీసిన సినిమాగా కూడా ఈ సినిమా హిస్టరీ లో నిలిచిపోయింది. ఈ సినిమాతో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోకి మంచి గుర్తింపు రావడం తో వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుంది. పారడైజ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసే విధంగా కనిపిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్ లో సినిమా తాలూకు థీమ్ ని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమా నాని డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. మరి ఆయన పోషించబోయే పాత్ర ఏంటి తద్వారా ఈ సినిమాకి ఆయన ఎలాంటి కాంట్రిబ్యూషన్ ని అందించబోతున్నాడు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుంది అనేది ఇప్పుడు కీలకంగా మారబోతుంది. మరి ఈ సినిమాతో నాని మరోసారి తన స్టామినా ఏంటో చూపించబోతున్నాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Also Read : తమన్ వ్యాఖ్యలపై రామ్ చరణ్ అసంతృప్తి..? ఇన్ స్టాగ్రామ్ లో ‘అన్ ఫాలో’

దసర సినిమాలో ‘చంకీల అంగిలేసి’ అనే సాంగ్ ఆడియో పరంగా సూపర్ సక్సెస్ అయినప్పటికి అది విజువల్ గా అంత బాగా లేదు అంటూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన తమన్ ఆ సాంగ్ మీద కొన్ని కామెంట్స్ చేయడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు.

ఆయన మ్యూజిక్ లో ఫాల్ట్ లేదు కానీ సినిమాని విజువల్ గా చూపించడంలో దర్శకుడు, కొరియోగ్రాఫర్ చాలా వరకు ఫెయిల్ అయ్యారు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు నాని తో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెలని కూడా కొంతవరకు బాధపెడుతున్నట్టుగా తెలుస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని అందుకున్నారు. కాబట్టి వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతుంది.

మరి తమన్ మాట్లాడిన మాటల్లో అంత పెద్దగా తప్పులైతే ఏమీ లేవు అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ సాంగ్ భారీగా హిట్ అయినప్పటికి, విజువల్ గా ఆ సాంగ్ అంత పెద్దగా ఎంగేజ్ చేయలేక పోయింది. అని తమన్ మాట్లాడాడు అందులో అతన్ని తప్పు పట్టడానికి ఏముంది? అందులో ఉన్నదే ఆయన చెప్పాడు కదా అంటూ మరి కొంతమంది తమన్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు…

Also Read : రామ్ చరణ్ ని టార్గెట్ చేసిన నాని..వెనకడుగు వేసేది ఎవరు?