
RRR Postponed Again: సినీ ప్రియులకు “ఆర్ఆర్ఆర్” (RRR Movie) టీం నిరాశ పరుస్తూనే ఉంది. సినిమా విడుదల అనేది ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడి అక్టోబర్ కి ఫిక్స్ అయింది. కానీ మరోసారి సినిమా విడుదల గురించి ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ ఒక ట్వీట్ పెట్టింది. ‘అక్టోబర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్ చేసేందుకు పోస్ట్ ప్రొడెక్షన్ కూడా చాలా వరకు పూర్తీ చేశాము. కానీ, ‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్ ను వాయిదా వేయక తప్పడం లేదు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లు ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించలేకపోతున్నాం. థియేటర్లు పునఃప్రారంభమైన వెంటనే తప్పకుండా సినిమాని రిలీజ్ చేస్తాం’ అంటూ ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ స్పష్టం చేసింది. అయితే, రాజమౌళి 2022 సంక్రాంతికి టార్గెట్ గా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తోంది.
నిజానికి గత నెలలో మేం సంక్రాంతికి వస్తున్నాం అంటూ ఇండస్ట్రీలోని మిగతా నిర్మాతలకు చెప్పారు ఆర్ఆర్ఆర్ మేకర్స్. అందుకే, కొంతమంది నిర్మాతలు తమ సినిమాలను సంక్రాంతి నుంచి పోస్ట్ పోన్ చేసుకున్నాయి. కానీ, సంక్రాంతికి అయినా ఆర్ఆర్ఆర్ వస్తుందా అన్నది ఇక్కడ డౌటే.
ఎందుకంటే.. ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉన్న సినిమా. పైగా అన్ని చోట్లా బారీ రేట్లు పలుకుతుంది. ఇలాంటి పరిస్తుతుల్లో మార్కెట్ ఫ్రీగా ఉన్న సమయంలో రిలీజ్ ప్లాన్ చేసుకోవాలి. మిగిలిన బాషలలో సంక్రాంతికి బారీ సినిమాలు రిలీజ్ సిద్దంగా ఉన్నాయి. ఆ సినిమాల మీద పోటీకి వెళ్తే ఆర్ఆర్ఆర్ కి కూడా నష్టమే.
కాబట్టి.. రిలీజ్ కి అనుకూలంగా ఉన్న సమయంలోనే రిలీజ్ ప్లాన్ చేసుకోవాలి. ఇక తెలుగులో జనవరి 12, 13వ తేదీలలో ఆల్ రెడీ మహేష్, పవన్ సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి. ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ రిలీజ్ అనేది, ఆర్ఆర్ఆర్ టీంతో పాటు మిగిలిన సినిమా వాళ్లకు కూడా పెద్ద సమస్య అయిపోయింది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.