Varanasi 2 : ‘వారణాసి’ చిత్రానికి సంబంధించి సినీ వర్గాల్లో, అభిమానులలో సరికొత్త చర్చ మొదలైంది. రాజమౌళి లాంటి విజన్ ఉన్న దర్శకుడు ఈ సారి ప్లాన్ చేసిన కాంబినేషన్ చూస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.
ప్యాన్-వరల్డ్ ‘వారణాసి’పై భారీ అంచనాలు
‘ఆర్ఆర్ఆర్’ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని ప్యాన్-వరల్డ్ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పేరు ‘వారణాసి’ అని ప్రకటించారు.. ఈ టైటిల్‌తో పాటు, ఇది టైమ్ ట్రావెల్, వారణాసి నగరం, రామాయణం అంశాల మిళితమైన కథ అని తెలియడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
‘వారణాసి 2’లో మల్టీస్టారర్ ధమాకా?
‘వారణాసి 1’లో మహేష్ బాబు హీరోగా నటిస్తే ఈ ఫ్రాంచైజీకి సంబంధించిన రెండో భాగం ‘వారణాసి 2’ కోసం రాజమౌళి మరింత భారీ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ సమాచారం ప్రకారం.. ‘వారణాసి 2’లో ఏకంగా ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలను కలిపి తెరకెక్కించబోతున్నారట! ఆ ఇద్దరు మరెవరో కాదు… యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
– పురాణాల టచ్, దేవతలుగా హీరోలు!
రాజమౌళి ఈ సెకండ్ పార్ట్‌ను పురాణాలు, రామాయణానికి లింక్ చేసి తీయాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభాస్ – రామ్ చరణ్‌లను పౌరాణిక పాత్రల్లో ముఖ్యంగా దేవతల రూపంలో రాజమౌళి మలచబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్‌ను శ్రీరాముడిగా చూపించిన రాజమౌళి, ఇప్పుడు ప్రభాస్ లాంటి భారీ స్టార్‌తో కలిసి పురాణ అంశాలతో కూడిన మల్టీస్టారర్‌కు ప్లాన్ చేయడం నిజంగా అరాచకం అనే చెప్పాలి.
ప్రస్తుతం ఇది కేవలం ఇన్ సైడ్ టాక్ మాత్రమే అయినప్పటికీ, ఇది నిజమైతే మాత్రం, ‘వారణాసి 2’ భారతీయ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం. ఈ కాంబో గురించి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
#Prabhas as #Karna#RamCharan as #Arjuna@ssrajamouli pls bring it on#AI #Mahabharat pic.twitter.com/ig3Ir6L7YJ
— Mr_Bhaddhakasthuduᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ (@Bhaddakasthudu) December 1, 2025