Food safety crisis: కొన్ని రోజుల కింద ఐస్ క్రీమ్ తిని పాపమరణం… మరి కొన్ని రోజుల కింద మోమోస్ తిని మహిళా మృతి.. ఇలాంటి వార్తలు దాదాపు రోజుకు ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇలా వీరు మరణించడానికి కల్తీ ఆహారం అని తేలుతోంది. అయితే కలిసి ఆహారం ఎక్కడ ఉంది? ఎక్కడ తయారు చేస్తున్నారు? అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ లో ఓపెన్గానే ఆహారాన్ని కల్తీ చేస్తున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా విచ్చలవిడిగా కల్తీ ఆహారం విక్రయించకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా FSSAI ని ఏర్పాటు చేసింది. అయితే మరి కల్తీ ఆహారం ఎందుకు తయారవుతుంది? కల్తీ ఆహారం తిని ఎందుకు మరణిస్తున్నారు? వీటన్నింటికీ కారణం ఎవరు?
భారతదేశంలో ఉత్పత్తి చేసిన ఆహార పదార్థాలను ప్రజలకు విక్రయించడానికి ముందుగా లైసెన్స్ ను కలిగి ఉండాలి. కంపెనీలు, సంస్థలు తయారు చేసే ఉత్పత్తులు నాణ్యమైనవి.. ఫుడ్ ఏర్పాటు చేయడంలో నిబంధనలు తీసుకుంటున్నట్లు తెలియజేస్తూ Food safety and standards Authority of India (FSSAI) నుంచి లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లైసెన్సు జారీ అయిన తర్వాతనే ఏ కంపెనీ లేదా సంస్థ అయినా ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఉత్పత్తి చేసిన ఆహార పదార్థాలు నాణ్యమైనవి ఉన్నాయా? లేదా కల్తీ అయ్యాయా? అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి FSSAI తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి మన దేశంలో ఇంతగా ఆహారం కల్తీ కావడానికి కారణమేంటి? అసలు అధికారులు ఎలాంటి విధులు నిర్వహించడం లేదా?
కొందరు నిపుణులు తెలుపుతున్న ప్రకారం ఈ డిపార్ట్మెంట్ కు చెందిన చాలామంది అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే కల్తీ ఆహారం విచ్చలవిడిగా మార్కెట్లోకి వస్తుందని అంటున్నారు. కల్తీ ఆహారం తినడం వల్లే చాలామంది మరణిస్తున్నారని పేర్కొంటున్నారు. ఎలాంటి దుర అలవాట్లు లేని వారు సైతం అనారోగ్యాల బారిన పడడానికి కారణం బయట దొరికే ఆహార పదార్థాలు అని తెలుపుతున్నారు. కొంతమంది ఇంట్లో వండిన ఆహారం కంటే బయట దొరికే ఆహారం పైనే ఆధారపడుతూ ఉంటారు. ఇలాంటివారు ప్రతిరోజు తినడం వల్ల వారిలో డయాబెటిక్, జాండీస్, కిడ్నీ సమస్యలు వంటి వి వచ్చి ఆ తర్వాత మరణానికి గురవుతున్నారు. ఎంతోమంది మరణించిన వారిలో ఆహార పదార్థాల కల్తీనే ఉన్నట్లు కొందరు వైద్యులు నిర్ధారించారు.
మార్కెట్లో ఉండే హోటళ్ళు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు కల్తీ లేకుండా ఆహార పదార్థాలను విక్రయించడంపై FSSAI ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం ఈ అధికారులు పెద్దగా పట్టించుకోవడంలేదని కొందరు ఆరోపిస్తున్నారు. ఇలా వీరు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే కొందరు హోటల్లో యజమానులు రోజుల తరబడి కుళ్లిపోయిన ఆహార పదార్థాలను ఫ్రిజ్లో ఉంచుతూ ప్రజలకు అందిస్తున్నారు. ఎప్పుడు ఓసారి తనిఖీలు నిర్వహించి బయటపడినా.. వారిపై చర్యలు తీసుకోవడం లేదు. ఇలా ఏమాత్రం కఠిన చర్యలు లేకపోవడం వల్లే కల్తీ ఆహారం రాజ్యమేలుతుందని చాలామంది ఆరోపిస్తున్నారు.