SS Rajamouli : సినిమాలను తీయడం ఒకెత్తయితే దానిని సక్సెస్ ఫుల్ గా ప్రేక్షకులకు చేరువయ్యేలా చేయడం మరొక ఎత్తు గా మారింది. చాలామంది దర్శకులు మంచి సినిమాలను చేసినప్పటికి దానికి సరైన పబ్లిసిటీ లేకపోవడం వల్ల ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోతున్నాయి. రాజమౌళి ఈ విషయంలో చాలా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉంటాడు. సినిమాని తీయడానికి ఆయన ఎంత కష్టపడతాడో అంతకు మించి ఆ సినిమాను ప్రమోట్ చేస్తాడు. తద్వారా సినిమాని చూడల కుతూహలాన్ని ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కలిగిస్తాడు. దానివల్ల ఆయన భారీ సక్సెస్ ని సాధించి భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతున్నాడు. ఇక ఇప్పటివరకు రాజమౌళి చేసిన అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడానికి కారణం కూడా అదే కావడం విశేషం…ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే ఆయన పరిధి ఎల్లలు దాటి పోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. హాలీవుడ్ సినిమా రేంజ్ ను టచ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు… ఇక అక్టోబర్ 31వ తేదీన బాహుబలి రెండు పార్టులను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక దీనికోసం కూడా ఆయన చాలా వరకు కసరత్తులు చేసి సినిమాలను రిలీజ్ చేయాలనే ప్లాన్ వేస్తున్నాడు. దానికోసం ఆయన చాలా వరకు కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఒరిజినల్ సినిమా కోసం ఆయన ఎంతలా కష్టపడుతుంటాడో ఈ సినిమాని రీ రిలీజ్ చేయడానికి కూడా అంతలా కష్టపడుతున్నాడు.
ఇదంతా చూస్తుంటే రాజమౌళికి సినిమా అంటే ఎంత పిచ్చో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా మీద ప్రమోషన్స్ ని భారీ లెవెల్లో చేపట్టి సినిమాని రిలీజ్ సమయంలో ఎంత హైప్ క్రియేట్ చేశాడో ఇప్పుడు కూడా అదే హైప్ ను మెయింటైన్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక ప్రభాస్, రానాలతో ప్రమోషన్స్ చేయించడానికి రెడీ అవుతున్నాడు.
ఇక దాంతోపాటుగా బాహుబలి ది ఎపిక్ ఎండింగ్లో బాహుబలి 3 ని అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక బాహుబలి 3 కట్టప్ప నేపథ్యంలో తెరకెక్కించాలనే ప్రణాళికలు చేస్తున్నారు. మరి తన బ్యాక్ స్టోరీ ఏంటి కట్టప్ప ఎందుకని రాజ్యానికి కట్టుబానిసగా మారాడు అనే విషయాన్ని ఈ సినిమాలో తెలియజేస్తారట…
మొత్తానికైతే బాహుబలి రెండు పార్ట్ లకు మించి మూడోవ పార్ట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇదంతా చూస్తున్న ప్రేక్షకులతోపాటు సినిమా మేధావులు సైతం బాహుబలి రీ రిలీజ్ ను సైతం బిజినెస్ యాంగిల్ లో ఆలోచించి బాగా ప్రమోషన్స్ చేస్తున్న రాజమౌళి తెలివికి హ్యాటఫ్ చెప్పాల్సిందే అంటున్నారు…ఇక బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ లో భారీ రికార్డు లను క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…