BJP MP, attack : సామాన్యులను ఎవరైనా కొడితే పెద్దగా సంచలనం కాదు. కానీ ఒక రాజకీయ నాయకుడిని అందులోను ఒక పార్లమెంట్ సభ్యుడిని కొడితే కచ్చితంగా సంచలనం అవుతుంది. ఈ సంచలనం కోసమే కొంతమంది నాయకులు ఎదురు చూశారు. ఎదురుచూసినట్టుగా ఆ ప్రాంతానికి ఎంపీ వచ్చారు. లేని గొడవను సృష్టించారు. ఉన్నట్టుండి రాళ్లతో దాడి చేశారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రస్తుతం విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. డార్జిలింగ్ ఏరియాలో వర్షాలు కురవడం వల్ల కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అక్కడ 17 మంది దాకా చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి బిజెపి ఎంపీ ఖాగేన్ ముర్ము ఆ ప్రాంతంలో పర్యటించారు.. బాధితులను పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వపరంగా పరిహారం అందించి ఆదుకుంటామని వారికి భరోసా కల్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. సామాన్యుల మాదిరిగా అక్కడ నటించారు. రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుందని, కేంద్ర ప్రభుత్వం నుంచే ఇంతవరకు తమకు సహకారం అందలేదని నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా బీజేపీ ఎంపీ ఖంగు తిన్నారు. కేంద్రంపై వారు చేస్తున్న విమర్శలను తట్టుకోలేక పోయారు. అంతేకాదు వారిని వారించే ప్రయత్నం చేశారు. కానీ ఇంతలోనే ఆ పార్టీ కార్యకర్తలు సహనం కోల్పోయారు. అక్కడే ఉన్న రాళ్లతో ఎంపీ మీద దాడి చేశారు.. ఈ ఘటనలో ఎంపీ ముఖానికి తీవ్రంగా గాయాలయ్యాయి.
రక్తస్రావం అధికంగా జరగడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో బిజెపి కార్యకర్తలు ఆయనను వెంటనే ప్రభుత్వ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారని బిజెపి కార్యకర్తలు చెబుతున్నారు. దీనిపై పోలీసులకు బిజెపి కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనతో తమకు సంబంధం లేదని టి ఎం సి పేర్కొనడం ఇక్కడ గమనార్హం. ఇటీవల కాలంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికార పార్టీ కార్యకర్తల ఆగడాలు విపరీతమయ్యాయి. త్వరలోనే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అధికార పార్టీ కార్యకర్తలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ప్రతిపక్షం అనేది లేకుండా చేయడానికి అక్కడ అనేక రకాల దుర్మార్గాల కు పాల్పడుతున్నారు. చివరికి ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులపై దాడులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఏకంగా బిజెపి ఎంపీపై రాళ్లతో దాడి చేశారంటే అక్కడ అధికార పార్టీ కార్యకర్తల ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
Malda BJP MP Khagen Murmu and Siliguri BJP MLA Dr Shankar Ghosh were beaten with chappals and pelted stones by locals of Dooars, Jalpaiguri, North Bengal when they had gone to shed crocodile tears in the flooded areas.
People know who really cares and who come as migratory… pic.twitter.com/TLwbmr2Do3— Sanghamitra Bandyopadhyay (@SanghamitraLIVE) October 6, 2025