Vijay Devarakonda – Rashmika Mandanna : చాలా కాలం నుండి సోషల్ మీడియా లో, మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా లో రష్మిక(Rashmika Mandanna), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రేమలో ఉన్నట్టు, ప్రస్తుతం డేటింగ్ చేసుకున్నట్టు, వార్తలు వినిపించిన సంగతి మన అందరికీ తెలిసిందే. కొన్ని మీడియా చానెల్స్ అయితే వీళ్లిద్దరికీ రహస్యంగా విదేశాల్లో పెళ్లి కూడా జరిగిపోయిందని, ప్రస్తుతం వీళ్లిద్దరు హైదరాబాద్ లో ఒకే ఇంట్లో ఉంటున్నారని కూడా చెప్పుకొచ్చారు. అన్ని నిజాలే కానీ, పెళ్లి మాత్రం జరగలేదు. రీసెంట్ గానే వీళ్లిద్దరు కుటుంబ సభ్యుల సమక్ష్యం లో నిశ్చితార్థం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంకా బయటకు రాలేదు కానీ, జరగాల్సిన తంతు మొత్తం జరిగిపోయిందని మీడియా కి అధికారికంగా సమాచారం వెళ్ళింది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో కానీ, లేదా వచ్చే ఏడాది ప్రారంభం లో కానీ వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరికీ సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీ ముందు ఉంచబోతున్నాము.
వీళ్లిద్దరి పరిచయం ‘గీత గోవిందం’ నుండే మొదలైందని అంతా అనుకుంటున్నారు. కానీ ‘అర్జున్ రెడ్డి’ సమయం నుండే వీళ్ళ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అర్జున్ రెడ్డి పెద్ద కమర్షియల్ హిట్ అయ్యాక, విజయ్ దేవరకొండ తనకు అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్లను పిలిచి గ్రాండ్ పార్టీ ఇచ్చాడట. ఈ పార్టీ లో రష్మిక కూడా ఉందట. ఈ విషయాన్నీ రణబీర్ కపూర్ ‘అన్ స్టాపబుల్’ షోలో చెప్పుకొచ్చాడు. అప్పటికే రష్మిక కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి తో ప్రేమలో ఉంది. వీళ్లిద్దరు గీత గోవిందం సినిమా మొదలు అవ్వకముందే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ, వీళ్లిద్దరు విడిపోవాల్సి వచ్చింది. ఇక అప్పటి నుండి రష్మిక విజయ్ కి బాగా దగ్గరవ్వడం, ఇద్దరి మనసులు కలవడం, ఇరువురి కుటుంబ సభ్యులు కూడా వీళ్లిద్దరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటివి జరిగాయి.
ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరి మధ్య ఉన్న వయస్సు తేడా ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. విజయ్ దేవరకొండ కి ప్రస్తుతం 36 ఏళ్ళు. రష్మిక రీసెంట్ గానే 29 వ సంవత్సరం లోకి అడుగుపెట్టింది. ఇద్దరి మధ్య దాదాపుగా 7 ఏళ్ళ తేడా. ఇంత వయస్సు తేడా ఉన్న వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవడం ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు కానీ, ప్రేమకు వయస్సు తో సంబంధం లేదు అనేది జీవిత సత్యం. సెలబ్రిటీస్ లో వయస్సు విషయం లో భారీ తేడా ఉన్న అతి తక్కువ జంటల్లో, రష్మిక, విజయ్ దేవరకొండ జంట కూడా ఒకటి. చూడాలి మరి వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది.