Rajamouli : భారీ సినిమాలను తీసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి(Rajamouli)… ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుంది… ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన బాహుబలి (Bahubali) సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినిమా స్టామినా పెంచేశాడనే చెప్పాలి. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం తెలుగు సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూసే రోజును తీసుకొచ్చాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఒక విజువల్ వండర్ గా తెరకెక్కిన బాహుబలి (Bahubali) సినిమా భారీ కలెక్షన్స్ ని రాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేసింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమా కూడా 1300 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి ఇండియాలో టాప్ 5 హైయెస్ట్ గ్రాసర్లలో ఒకటి గా నిలిచింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ సినిమా కోసం దాదాపు 1000 కోట్లకు పైన బడ్జెట్ ను కేటాయిస్తున్నారు అంటే ఈ సినిమాకి దాదాపు 3 వేల కోట్ల వరకు కలెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…
ఇక ఇదిలా ఉంటే రాజమౌళి భారీ సినిమాలను చేయడం వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదు. ఎందుకంటే ప్రేక్షకులు 150 రూపాయలు పెట్టి సినిమా టికెట్టు కొనుక్కొని థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తే అందులో విజువల్ వండర్స్ ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
ఇక భారీ సినిమాల్లో మాత్రమే విజువల్ వండర్స్ అయితే ఉంటాయి. ఇక రెండు మూడు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే చిన్న సినిమాల్లో ఎలాంటి గ్రాఫిక్స్ ని వాడరు. కేవలం కంటెంట్ బేస్డ్ సినిమాలను మాత్రమే చేస్తూ ఉంటారు. తద్వారా చిన్న సినిమాలను ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి చూసే అవకాశం లేకుండా పోతుంది… ఇక దానివల్ల థియేటర్లో చిన్న సినిమాలు ఆడటం లేదు. ఇక ఇంకొంతమంది ప్రేక్షకులైతే చిన్న సినిమా సూపర్ సక్సెస్ అయిందని తెలిసినప్పటికి ఒక వారం రోజులు పోతే ఓటిటి లోకి వస్తుంది కదా అప్పుడు చూద్దాంలే అని లైట్ తీసుకుంటున్నారు…
ఇలా రాజమౌళి చేసిన పనికి చిన్న సినిమాలు దెబ్బ తిన్నాయనే చెప్పాలి. ఒకరకంగా ఇండస్ట్రీ మొత్తాన్ని డ్యామేజ్ చేశాడు. రాజమౌళి భారీ సినిమాలకు వరంగా మారితే చిన్న సినిమాలకు మాత్రం శాపంగా మారడనే చెప్పాలి…మరి ఇకమీదటైనా చిన్న సినిమాలకు ఆదరణ దక్కుతుందా? తద్వారా చిన్న ప్రొడ్యూసర్లు చిన్న హీరోలు మంచి అవకాశాలను అందుకునే ఛాన్సులు ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది…