https://oktelugu.com/

Heroes : ఆ స్టార్ హీరోల కాళ్ళ మీద పడలేదని ఆ యంగ్ హీరోకి లైఫ్ లేకుండా చేశారా..? ఇంతకీ ఆ హీరోలు ఎవరు..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదగాలంటే సినిమా పరిశ్రమలో ఉన్న కొంతమంది పెద్దల సపోర్ట్ అయితే ఉండాలి అని ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు. అలా ఉంటేనే ఇండస్ట్రీలో అన్ని పనులు చాలా ఈజీగా అయిపోతాయనేది ప్రతి ఒక్కరి వాదన... కానీ టాలెంట్ ఉంటే ప్రతి ఒక్కరు ఇక్కడ స్టార్ హీరోలుగా రాణిస్తారు అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు...

Written By: , Updated On : February 12, 2025 / 09:10 AM IST
Heroes

Heroes

Follow us on

Heroes : సినిమా ఇండస్ట్రీలో డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనే వార్తలు మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం…ఆ హీరోని ఈ హీరో తొక్కేశాడు, ఆ కొత్త హీరోని ఈ హీరో సపోర్టు చేస్తున్నాడు అంటూ చాలా వార్తలు వస్తునే ఉంటాయి. అయితే యంగ్ హీరోలు ఎదగాలంటే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది స్టార్ హీరోల సపోర్ట్ అయితే ఉండాలి. అలా ఉన్నప్పుడే అప్ కమింగ్ హీరోలకు మంచి అవకాశాలు రావడమే కాకుండా వాళ్ల మూవీస్ కి మంచి మార్కెట్ కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది…అయితే ఇండస్ట్రీలో ఉన్న హీరోలు కొత్తగా వచ్చే హీరోల దగ్గర నుంచి కొంత రెస్పెక్ట్ తో పాటు ఆ కొత్త హీరోలు వాళ్ళ కిందే ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ తో ఉంటారు. దానివల్ల కొత్తగా వచ్చిన హీరోలందరూ ఇంతకు ముందున్న హీరోలను కలిసినప్పుడు వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ల కాళ్లకు దండం అయితే పెట్టాల్సి ఉంటుంది. అలా ఉన్నప్పుడే ఇంతకుముందు ఇండస్ట్రీలో పాతుకుపోయిన హీరోల ఈగో సాటిస్ఫై అవుతుంది. తద్వారా వాళ్లకు సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఇండస్ట్రీలో ముందుకు తీసుకెళ్లడానికి చాలావరకు ప్రయత్నం అయితే చేస్తుంటారు. అయితే ఒక ఇద్దరు స్టార్ హీరోలు ఒక పెద్ద ఈవెంట్ కి వచ్చినప్పుడు ఒక యంగ్ హీరో వాళ్ల దండం పెట్టలేదనే ఉద్దేశ్యంతో అతన్ని తొక్కేశారనే వార్తలు అప్పట్లో సంచలనాన్ని రెకెత్తించింది.

కెరియర్ మొదట్లోనే వరుసగా నాలుగు సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న ఒక యంగ్ హీరో ఈ స్టార్ హీరోలకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదని తెలుసుకున్న వాళ్లు అతనికి సినిమాలు లేకుండా చేశారు. ఒక కొన్ని మూవీస్ వచ్చిన ఆ సినిమాలకు కూడా పబ్లిసిటి, ప్రమోషన్స్ ఏమీ దక్కకుండా చేసి అతనికి సినిమా ఇండస్ట్రీలో కెరీర్ లేకుండా చేశారు.

ఇక మొత్తానికైతే ఇప్పుడు ఆ హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకి ఇంతలా ఈగోలు ఉండడం అనేది సరైన విషయం కాదు. వాళ్ల కాళ్ళ మీద ఎందుకు పడాలి? ఎవరీ టాలెంట్ తో వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టే వాళ్ళు ఆ స్టేజ్ లో నిలబడ్డారు.

ఒకరి దయాదాక్షిణ్యల మీద బతికాల్సిన అవసరమైతే వాళ్లకు లేదు కదా అంటూ కొంతమంది సినిమా విమర్శకులు సైతం ఇలాంటి విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఆ స్టార్ హీరోలను విమర్శిస్తూ ఉంటారు…అయితే అందరూ స్టార్ హీరోలు అలానే ఉంటారని కాదు. కొంతమంది యంగ్ హీరోలను సపోర్ట్ చేస్తూ వాళ్ళ సినిమాలకు ప్రమోషన్స్ ని కూడా చేస్తూ ఉంటారు. ఇక ఇంకా కొంతమంది మాత్రం ఎవరిని ఎప్పుడు తొక్కేయాలా అనే ఆలోచనతోనే ఉంటారు అంటూ కొంతమంది సీనియర్ నటులు సైతం అప్పుడప్పుడు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తు ఉంటారు…