Keeravani
Keeravani: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి సోషల్ మీడియా లో రోజుకో వార్త బయటకు అభిమానుల్లో ఫుల్ జోష్ ని నింపుతున్నాయి. ఈ సినిమా గురించి విశేషాలు బయటకు రాకుండా రాజమౌళి చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నాడు. కానీ సోషల్ మీడియా లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వృధా ప్రయత్నమే అని రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ వీడియో లీక్ అయ్యినప్పుడే అందరికీ అర్థం అయ్యింది. ఈ వీడియో లీక్ అయ్యినప్పటి నుండి రాజమౌళి తన షూటింగ్ పరిసరాల్లో సెక్యూరిటీ ని పెంచాడు. ఒడిశాలో మొదటి షెడ్యూల్ ని పటిష్టమైన భద్రత మధ్యలోనే ముగించారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విశేషాలను ఆ చిత్ర సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి చెప్పుకొచ్చాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
‘నా టూర్ MMK’ పేరుతో ఈనెల 22వ తారీఖున కీరవాణి(MM Keeravani) నిర్వహించబోతున్న కాన్సెర్ట్ కి సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మహేష్, రాజమౌళి సినిమా గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ఇప్పటి వరకు నా సినీ జీవితంలో ఇలాంటి కాన్సెప్ట్ తో ఒక సినిమా రావడం చూడలేదు. ఈ సినిమా జానర్ మాత్రమే అడ్వెంచర్ కాదు, సంగీతం అందించడం కూడా అడ్వెంచర్ తో కూడుకున్న పని. చాలా కష్టమైన ప్రయాణం ఇది, సరికొత్త సౌండ్స్ ని ఈ జానర్ కోసం సృష్టించాలి. ఇది నేను ఛాలెంజ్ గా తీసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు మూవీ పై మరింత ఆసక్తిని పెంచేలా చేస్తున్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి లాంటి వారికే ఈ సినిమా గురించి ఈ రేంజ్ లో చెప్తున్నాడంటే, రాజమౌళి ఏమి ప్లాన్ చేసి ఉంటాడో అని అభిమానులు సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు.
షెడ్యూల్స్ మొత్తం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసారని, ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల అవుతుంది కాబట్టి షూటింగ్ పూర్తి అవ్వడానికి చాలా సమయం పడుతుందని, కనీసం రెండేళ్ల వరకు ఆగాల్సిందే అంటూ రాజమౌళి సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి. ఫారెస్ట్ అడ్వెంచర్ తో పాటు సైన్స్ ఫిక్షన్ కూడా ఈ సినిమాలో అంతర్లీనంగా ఉంటుందట. ఇందులో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) నెగెటివ్ రోల్ లో కనిపించబోతుంది టాక్. మలయాళం హీరో పృథ్వీ రాజ్ కూడా ఒడిశా షెడ్యూల్ లో పాల్గొన్నాడు. తదుపరి షెడ్యూల్ కి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. రాజమౌళి తన ప్రతీ సినిమాకు ముందు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సినిమాకు ఇంకా అలాంటిది ప్లాన్ చేయలేదు, అభిమానులు ఈ ప్రెస్ మీట్ కోసం ఎదురు చూస్తున్నారు.